వ్యవసాయానికి రైతే రాజు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల తొలి ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..వ్యవసాయం వ్యాపారం కాదు..ఒక జీవన విధానం అని పేర్కొన్నారు .
see also :శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నీళ్ళీవ్వలేదు..ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని అవస్థలు పడ్డమో వర్ణనాతీతం అని తెలిపారువాతావారణ సమతౌల్యం దెబ్బతినడం వల్లనే అతివృష్టి, అనావృష్టి.రైతు సమన్వయ సభ్యుల బాధ్యత చాలా పెద్దది. గ్రామాల సమన్వయ సమితి ఆ గ్రామానికి కథా నాయకులు కావాలి అని పిలుపునిచ్చారు .రైతు పండించే రాశి చుట్టే కుల వృత్తులు ఆధారపడి ఉంటాయి అని తెలిపారురైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తున్నం. అనుభవం కలిగిన ఆయన సేవలు రైతు సంఘానికి ఉపయోగపడతాయి అని చెప్పారు .రైతులకు ప్రి పెయిడ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినం. ప్రిపెయిడ్ కార్డుల్లో ఎప్పటికప్పుడు నగదు క్రెడిట్ అవుతుంది అని తెలిపారు .రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నం. కోటి ఎకరాలు ప్రాజెక్టుల ద్వారానే పారే విధంగా అహోరాత్రులు శ్రమిస్తున్నం అని చెప్పారు .
see also :శ్రీదేవి మరణం పట్ల రామ్ గోపాల్ వర్మ ఏమని ట్వీట్ చేశారంటే