దాదాపు ఐదు దశాబ్దాలు పాటు ఇటు టాలీవుడ్ ,బాలీవుడ్ ,కోలీవుడ్ అన్ని రంగాల్లో పలు హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న అందాల తార శ్రీదేవి.కేవలం తనకు నాలుగు ఏళ్ళ వయస్సులోనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆమె పద్మశ్రీ అవార్డుతో పాటుగా పదిహేను ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకున్న గొప్ప నటి.
దాదాపు రెండు తరాల హీరోలతోపాటుగా స్టార్ హీరోలతో కల్సి మొత్తం రెండు వందల సినిమాల్లోకి పైగా నటించారు ఆమె .అయితే ఆమె ఒక హీరోయిన్ ,బాలనటిగా మాత్రమే మనకు తెల్సు.కానీ మనకు తెలియని రహస్యం ఒకటి ఉంది తెలుసా.అదే పెయింటింగ్ .తనకు ఎంతో ఇష్టమైన ఇది ఎవరికీ తెలియకుండా దాదాపు ఐదేండ్ల నుండి తనకు నచ్చినవాళ్ళకు బొమ్మలను గీసి బహుమతులుగా ఇస్తుంది అంట .
see also :శ్రీదేవి మరణం వెనుక.. దాగిన నిజాలెన్నో.. బోనీకపూర్ చెప్పని సంచలనాలు ఇవే..!
తన మరిది కూతురైన సోనమ్ కపూర్ కి అందమైన చిత్రం గీసి ఇచ్చింది అంట .ఇంకా సల్మాన్ ఖాన్ ,డిజైనర్ మనీష్ మల్హోత్రా తదితర స్టార్లకు కూడా అమ్మడు ఇచ్చింది అంట .తనకు నచ్చినవాటిలో మైకేల్ జాక్సన్ తన గారాల పట్టి జాన్వీ,ఖుషీ కపూర్ లకు ఇచ్చినవి కూడా ఉన్నాయి అంట .దివికెగిసిన తార శ్రీదేవి ఓ నటిగా మాత్రమే మనందరికి సుపరిచితం. కాని తనలో మనకి తెలియని మరో టాలెంట్ ఉంది. శ్రీదేవికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టమట.