తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ ,అదిలాబాద్ జిల్లాల్లో మూడు రోజులు పర్యటించనున్నారు.ఈ క్రమంలో ఈ రోజు (సోమవారం-26) ఉదయం పదిన్నరకు ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి కరీంనగర్ కు వెళ్లనున్నారు.రైతు సమన్వయ సదస్సులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ మైదానంలో 15జిల్లాల రైతు సమన్వయ సభ్యులతో సమావేశం అవుతారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సదస్సు జరగనుంది. సదస్సుకు దాదాపు 10 వేల మంది హాజరు కానుండటంతో.. జిల్లా అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు .అయితే ఈ రోజు సదస్సు తరువాత సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా శివారులోని తీగల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ లో రాత్రి బసచేస్తారు.
see also : సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …
రేపు (ఫిబ్రవరి-27) ఉదయం పది గంటల 45 నిమిషాలకు ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దులోని చనాకా కొరాట బ్యారేజ్ ను సందర్శించి.. పనులను పరిశీలిస్తారు. తిరిగి ఆదిలాబాద్ చేరుకుని.. స్థానిక డైట్ కళాశాల గ్రౌండ్ లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సమావేశమౌతారు. లంచ్ తర్వాత మంచిర్యాల జిల్లా సీసీసీ కాలనీ, శ్రీరాంపూర్ లోని సింగరేణి ఏరియాల్లో సీ ఎం కేసీఆర్ పర్యటిస్తారు . సాయంత్రం ఐదున్నర గంటల వరకు సింగరేణి సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకుని.. ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో బసచేస్తారు.
see also : మోత్కుపల్లిపై చర్యలకు జంకుతున్న బాబు..కారణం ఇదే
మూడో రోజు బుధవారం(ఫిబ్రవరి-28).. రామగుండం రీజియన్ లోని సింగరేణి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తారు . ప్రగతి స్టేడియంలో నిర్వహించే సింగరేణి కార్మికసభలో పాల్గొంటారు. అక్కడి నుంచే మందమర్రి ఏరియా కాసిపేట 2, కె.కె.6, మణుగూరు ఏరియా కొండాపురం గని, భూపాలపల్లి ఏరియా కేటీకే-3, కేటీకే-5, కొత్త బొగ్గు గనులను ప్రారంభిస్తారు . లంచ్ తర్వాత ముర్మూర్ లో అంతర్గాం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత హెలికాప్టర్ లో బయలుదేరి హైదరాబాద్ ప్రగతిభవన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకుంటారు .