ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు కన్పిస్తున్నాయి.దాదాపు మూడు వందలకు పైగా మూవీలలో నటించి ..ఆర్యభట్ట మూవీ ద్వారా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న నటి రమ్యశ్రీ..
See Also:చంద్రబాబుకు బిగుస్తున్న ఉచ్చు: ఓటుకు నోటు కేసులో మరో సంచలనం..!!
రాష్ట్రంలో సబ్బవరంలో నటి రమ్య శ్రీ పర్యటించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు మూడు వందల సినిమాల్లో నటించాను.తెలుగు వారు తనని తమ ఇంట్లో ఆడబిడ్డగా ఆదరించారు.రమ్య హృదయాలయ పౌండేషన్ ద్వారా పేదవారికి అనేక రకాల సేవలను అందిస్తున్నాను.రాజకీయం అనేది పుట్టుకతో రాదని ..అనుభవం ద్వారా వస్తుంది.సినిమా రంగం నుండి వచ్చి ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ముఖ్యమంత్రులయిన చరిత్ర సినిమా వాళ్ళకు ఉంది.
See Also:వైఎస్ జగన్‌వి ఊరపంది ఆలోచనలు-ఏపీ మంత్రి ..!!
వాళ్ళే నాకు ఆదర్శం.తనకు చేతనైనంతగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం.ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సేవ చేయడానికి వీలు ఎక్కువగా ఉంటుందంటే తప్పకుండ వస్తాను .ప్రజలు ఆదరిస్తే రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తాను అని ఆమె తెలిపారు.అయితే ప్రస్తుతం ఉన్న పార్టీలల్లో ఏ పార్టీలో చేరతారని విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రస్తుతం ప్రజల తరపున ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజా పక్షాన నిలిచే పార్టీలో చేరతాను అని ఆమె పరోక్షంగా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై అలుపు ఎరగని పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడుతున్న వైసీపీ లో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.అయితే రమ్య శ్రీ చేరడం వలన ప్రస్తుతం ఉన్న ఆర్కే రోజాకు కొంచెం హెల్ప్ అవుతుందని రాజకీయ వర్గాల టాక్ ..చూడాలి మరి ప్రజాసేవ చేయాలనీ ఆరాటపడుతున్న రమ్య శ్రీ లాంటి వారు రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి మార్పులు జరుగుతాయో ..ఏపీ ప్రజలు ఆదరించి పట్టం కడతారో లేదో ..!
See Also:చంద్రబాబు జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ …టీజర్ విడుదల …!