తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీపీ పెంచేందుకు ఆయన మిత్రపక్షమైన బీజేపీ ఎత్తుగడలు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. బాబును గట్టిగా ఎదుర్కునే మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి త్వరలో ప్రమోషన్ ఇవ్వనున్నారని సమాచారం. త్వరలోనే దక్షిణాదిలో బీజేపీకి అత్యంత కీలక రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.
see also :వైఎస్ఆర్‌లా.. జగన్ రాజకీయ పరిణితి – అద్భుతం..!!
టీడీపీ అవినీతిని వెలికితీస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పురందీశ్వరిని జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమవుతున్నారని సమాచారం. తాజాగా వెలువడిన రాజ్యసభ షెడ్యూల్ ప్రకారం ఆమెకు బెర్త్ కట్టబెట్టనున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం మొత్తం 16 రాష్ర్టాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వాటిలో పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా ఉంది. కర్ణాటకలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉండగా అందులో ఒక స్థానానికి పురందీశ్వరిని బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది.
see also :బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..
తెలుగుదేశం పార్టీకి గట్టి కౌంటర్లు ఇస్తుండటం, పార్టీలో చేరింది మొదలుకొని ఇప్పటివరకు నిబద్దతతో పనిచేయడం, పార్టీ బలోపేతానికి కృషిచేయడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. దీంతోపాటుగా త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడం మరో కారణంగా వివరిస్తున్నారు. కర్ణాటకలో కన్నడిగుల తర్వాత అత్యధికులు తెలుగువారే. దివంగత విఖ్యాత నటుడు ఎన్టీఆర్ వారందరికీ సుపరిచతుడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తనయకు అవకాశం కల్పించడం ద్వారా ఆ రాష్ట్రంలోని తెలుగువారికి సానుకూల సందేశం పంపించినట్లు అవుతుందని అంటున్నారు. తద్వారా రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లను రాబట్టుకునేందుకు అవకాశం దక్కుతుందని బీజేపీ పెద్దల ఆలోచనగా వివరిస్తున్నారు.
see also :