Home / INTERNATIONAL / భారత ఐటీకి హెచ్‌1బీ దెబ్బ ఇక మరింత కఠినతరం

భారత ఐటీకి హెచ్‌1బీ దెబ్బ ఇక మరింత కఠినతరం

హెచ్‌1బీ వీసాల జారీ ప్రక్రియను అమెరికా కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నూతన విధాన ప్రకటన చేసింది. ఇకపై హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే ఐటీ కంపెనీలు అదనపు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. తమ ఉద్యోగులకు సంబంధించిన వివరాలను, అందుకు తగిన ఆధారాలను తప్పనిసరిగా పొందుపర్చాలని పేర్కొంటూ బుధవారం ఏడుపేజీల మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్‌1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభం కానున్నది. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. మరికొద్ది రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా, అమెరికా నూతన నిబంధనలు జారీ చేసింది.

see also :ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..!

see also :మంత్రి కేటీఆర్ పై మ‌హిళా పారిశ్రామిక‌వేత్త ప్ర‌శంస‌

‘అమెరికా ఉద్యోగాలు.. స్థానికులకే’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన హామీని నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా హెచ్‌1బీ వీసాల జారీ విధానంలో భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నారు. మరికొద్దివారాల్లో నూతన వీసాల ప్రకియ ప్రారంభం కానుండగా, ఆంక్షలతో కూడిన తాజా విధానాన్ని ప్రకటించడం భారత ఐటీ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. హెచ్‌1బీ వీసా నూతన నిబంధనలు భారతీయులకేకాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థకూ భారీగా నష్టం కలిగిస్తుందని నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌ చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. తాజా నిబంధనలతో ఐటీ కంపెనీలు హెచ్‌1బీ వీసాల కోసం ఎక్కువ పేపర్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. హెచ్‌1బీ వీసా ద్వారా విదేశీ ఉద్యోగులకు తాత్కాలికంగా అమెరికాలోని కంపెనీల్లో పనిచేసే అవకాశం లభిస్తున్నది. ఈ వీసా ద్వారా పలు కంపెనీలు అమెరికన్‌ ఉద్యోగుల కొరత ఉన్న చోట నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ముఖ్యంగా భారత ఐటీ కంపెనీలు ఈ విధానంతో బాగా లబ్ధి పొందుతున్నాయి. థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్‌లో ఎక్కువ సంఖ్యలో తమ ఉద్యోగులను నియమిస్తున్నాయి. తాజాగా అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ (యూఎస్‌సీఐఎస్‌) విడుదల చేసిన నూతన పాలసీ ప్రకారం.. ఉద్యోగులు థర్డ్‌పార్టీ వర్క్‌సైట్‌లో పనిచేసే పరిమిత కాలానికి మాత్రమే హెచ్‌1బీ వీసా ఇవ్వాలని పేర్కొన్నది. ప్రస్తుతం హెచ్‌1బీ వీసా గడువు మూడేండ్లు కాగా, తాజా నిబంధనల్లో అంతకంటే తక్కువే ఉండాలని తెలిపింది. బెంచ్‌లో ఉన్న ఉద్యోగులకు హెచ్‌1బీ వీసా పొడిగింపు మరింత కఠినతరం కానున్నది.

see also :జ‌గ‌న్ నిర్ధోషి.. తెర‌పైకి ఒరిజిన‌ల్ కంపెనీ.. ప‌చ్చ‌ బ్యాచ్‌కి అర్ధ‌మ‌య్యేలా షేర్లు కొట్టండి..!

see also :బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..

నూతన విధానంలోని కీలకాంశాలు

· నైపుణ్యం, అర్హతలు : థర్ట్‌పార్టీ వర్క్‌సైట్‌లో హెచ్‌1బీ వీసా దరఖాస్తు చేసుకునే ఉద్యోగి తాను ప్రత్యేకమైన వృత్తిలో నిర్దిష్టమైన అర్హతలు కలిగి ఉన్నట్లు నిరూపించుకోవాలని కొత్త పాలసీ చెబుతుంది. ఉద్యోగార్హత, నైపుణ్య వివరాలను తగిన ఆధారాలతో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ-డాక్యుమెంట్స్‌ తప్పనిసరి.

· ఉద్యోగుల పని వివరాలు : ఉద్యోగుల కోసం హెచ్‌1బీ వీసాలు కోరే కంపెనీలు ఇకనుంచి దరఖాస్తుల విషయంలో పేపర్‌వర్క్‌పై కాస్త ఎక్కువగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు కేటాయించిన నిర్దిష్టమైన పని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, మార్కెటింగ్‌ ఎనాలిసిస్‌, కాస్ట్‌ బెనిఫిట్‌ ఎనాలిసిస్‌, బ్రోచర్లు, ఫండింగ్‌ డాక్యుమెంట్ల వంటివాటినీ కంపెనీలు సమర్పించాలి.

· ధ్రువీకరణ : ఉద్యోగి పనికి సంబంధించి సదరు సంస్థ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలి. అందులో ఆ కొలువులో ఆయన/ ఆమె ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు? ఉద్యోగి పనిగంటలు, చెల్లించే వేతనం, ఇతరత్రా ప్రయోజనాలు వంటి వివరాలను అందులో పేర్కొనాలి.

· ఉద్యోగ కాంట్రాక్టు : హెచ్‌1బీ వీసా కోసం పేర్కొన్న కాలపరిమితిలో.. విదేశీ నిపుణుడితో కుదుర్చుకున్న ‘ఉద్యోగ ఒప్పందం’ కాపీలను ఆయా సంస్థలు ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు తప్పనిసరిగా అందజేయాలి.

· కాలపరిమితి : ప్రస్తుత సంప్రదాయానికి భిన్నంగా మూడేండ్ల కన్నా తక్కువ కాలపరిమితితో కొత్త వీసాలు జారీ కానున్నాయి. హెచ్‌1బీ ప్రామాణిక కాలవ్యవధి మొత్తం అభ్యర్థి కొనసాగుతూ ఉండకపోయినా, థర్డ్‌పార్టీ వర్క్‌సైట్‌లో పనిచేసే పరిమిత కాలానికి మాత్రమే హెచ్‌1బీ వీసా ఇవ్వాలని నిబంధనావళి పేర్కొన్నది.

see also:రాజ్య‌స‌భ షెడ్యూల్ విడుద‌ల‌…గులాబీలో గెలుపు జోష్‌

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat