కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణకు ఆ పార్టీలో పొగపెడుతున్నారా? పార్టీలో ఆమె ఇమడలేకపోతున్నారా? త‌్వరలో పార్టీ వీడనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేయడం ఖాయమైన నేపథ్యంలో ఆయన్ను అడ్డుకునేందుకు అరుణ ప్రయత్నించగా..ఆమెకు కాంగ్రెస్ పెద్దలే సహకరించలేదని తెలుస్తోంది. దీంతో ఆమె పార్టీలో కొనసాగడంపై మథనపడుతున్నట్లు సమాచారం.
see also :మంత్రి కేటీఆర్ పై మహిళా పారిశ్రామికవేత్త ప్రశంస
see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..!
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే డీకే అరుణ వర్గీయులు ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి నాగంను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తదనంతరం టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాగంను ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్‌గాంధీని కల్పించినట్టు ప్రచారం జరిగింది. జైపాల్‌రెడ్డి ప్రోత్సహంతోనే ఉత్తమ్ నాగంను ఢిల్లీకి తీసుకెళ్లారని డీకే అరుణ వర్గీయులు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రయోజనాలను పట్టించుకో కుండా ఉత్తమ్ ఈ విధంగా వ్యవహరించడం ఏమిటని వారంటున్నారు. తమను పొమ్మనలేక పొగపొట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఉంటే త్వరలోనే ఆమె తన దారి తాను చూసుకోవడం ఖాయమని చెప్తున్నారు.
see also :ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..!
see also :భారత ఐటీకి హెచ్1బీ దెబ్బ ఇక మరింత కఠినతరం