ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్‌లు ప్రభుత్వం అందజేస్తుంది.
see also :అన్ని పట్టణాల్లో మినీ ట్యాంకు బండ్లు..మంత్రి హరీష్
తాజాగా వరంగల్ రూరల్ జిల్లా లోని వర్ధన్నపేట మండలం కట్యాల గ్రామానికి చెందిన సరిత దేవేందర్ యాదవ్ దంపతులకు స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి నిండి రూ.లక్ష రూపాయల చెక్కును ఈ రోజు అందజేశారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మార్కెట్ కమిటి చైర్మన్ గుజ్జ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.