ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్నశుక్రవారం తమ మిత్రపక్షమైన బీజేపీ పార్టీ విడుదల చేసిన రాయలసీమ డిక్లరేషన్ గురించి స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా రాయలసీమ ప్రాంతాన్ని తము అభివృద్ధి చేశామన్నారు.
చరిత్రలో కనివిని ఎరుగని విధంగా రాయలసీమ ప్రాంతానికి త్రాగునీల్లు సాగునీళ్ళు ఇచ్చామన్నారు.నేను కూడా రాయలసీమ బిడ్డనే అని అన్నారు.ఎప్పుడు గుర్తుకు రాని రాయలసీమ ప్రాంతం బీజేపీ పార్టీకి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.రాయలసీమ డిక్లరేషన్ పేరిట బీజేపీ డ్రామాలు ఆడుతుందని ఆయన హేద్దేవా చేశారు.
అంతగా ఏపీ పై ప్రేమ ఉంటె అమరావతిని దేశానికి రెండో రాజధాని ..కర్నూలులో సుప్రీం కోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలనీ ..అప్పుడే బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ఏమిటో అర్ధమవుతుందని ఆయన అన్నారు ..ఈ క్రమంలోనే టీడీపీ నేతలు బీజేపీ పై వ్యక్తిగత విమర్శలు చేయద్దు అని కోరడం విశేషం..