ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రే స్వయంగా అవినీతి చేస్కోమని చెప్పారు.మీకు సగం ..మాకు సగం పంచుకోవాలని ఆయన సూచించారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంఘటన మరిచిపోకముందే వైజాగ్ లో తెలుగు తమ్ముళ్ళ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.
జిల్లాలో పాయకరావు పేటకు చెందిన ఒక ప్రముఖ అధికార పార్టీ నేతకు మూగ జీవాలను ముఖ్యంగా అరణ్యంలో ప్రాణులను వేటాడే అలవాటు ఉంది.అలవాటులో భాగంగా ఆయన వేటాడుతూ సంబంధిత అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.దీంతో అధికారులు చట్టం ప్రకారం కేసు నమోదు చేయడానికి సిద్దమయ్యారు.
అప్పుడే తమ్ముడుకి తాము అధికార పార్టీ నేత అని గుర్తుకొచ్చి తనపై కేసులు నమోదు చేయాలనీ స్థానిక మహిళా వీఅర్వో అధికారిపై విరుచుకుపడ్డాడు సదరు నేత.అంతే కాకుండా అడ్డంగా దొరికిన కానీ తను వేటాడలేదని లేఖ ఇవ్వాలని సదరు ఉద్యోగిపై దాడికి కూడా తెగబడ్డారు.దీంతో సదరు మహిళ ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అధికార పార్టీ నేతపైనే కేసు పెడతావని బెదిరించడంతో ఏమి చేయలేక దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు ..