ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతులకు వరప్రదాయినిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కుట్రలు చేస్తున్నాయి . కేసుల మీద కేసులు వేస్తూనే ఉన్నారు . ఈ కుట్రల బ్యాచ్ కు మరోసారి చెంప చెళ్లుమనిపించేలా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది.
see also : మార్కెట్‌లోకి రోల్స్‌రాయిస్ ‘ఫాంటమ్–8’ వచ్చేసింది..!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలిచిందని చెప్పారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులొచ్చినా ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై కేసులు వేయించింది ఏ కాంగ్రెస్ నేతో త్వరలో బయటపెడుతామని చెప్పారు. కాంగ్రెస్ నేతల కుట్రలను.. సాక్ష్యాధారాలతో శాసనసభ వేదికగా బట్టబయలు చేస్తానన్నారు.