తెలంగాణ రాష్ట్ర సమితిలో మరోమారు విజయోత్సాహం కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ షెడ్యూల్ విడుదల అవడమే ఇందుకు కారణం. ఏప్రిల్‌లో పదవీ కాలం పూర్తయ్యే స్థానాలకు ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణాలో ఖాళీ అయ్యే మూడు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే చేరనున్నాయి. ప్రతిపక్షాలు సరిపడా సభ్యులు కూడా లేకపోవడం గమనార్హం. ఆయా పార్టీలు పోటీ చేసే స్థితిలో లేకపోవడం గమనార్హం. దీంతో అధికార పార్టీలో ఆ మూడు స్థానాలు ఎవరికి దక్కుతాయన్న చర్చలు మొదలయ్యాయి.
see also :భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అమ్రపాలి దంపతులు
see also :ఓటుకు నోటు సంచలనం..నన్ను చంపేస్తామంటున్నారు
రాజకీయవర్గాల చర్చల ప్రకారం అన్నివర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. పార్టీ సీనియర్లు, వివిధ వర్గాల అభిప్రాయం పరిగణనలోకి తీసుకొని పెద్దల సభ అభ్యర్థులకు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న నాయకులు, పార్టీ బలోపేతానికి ఉపయోగపడే నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు.
see also :మంత్రి కేటీఆర్ పై మహిళా పారిశ్రామికవేత్త ప్రశంస