ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల అవసరం లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అదినేత పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడ్డాడని, జగన్ చేసిన పాపాలు ఐఏఎస్ అధికారులపట్ల శాపాలుగా మారాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
see also : వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..!
see also : జగన్ స్వార్థం వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులపై కేసులు..!!
2019 ఎన్నికల్లోపు వైఎస్ జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదని, జగన్ చేసిన అవినీతిని ప్రజలు ఎప్పటికి మరిచిపోరన్నారు. జగన్ సీఎం కావడం కలలో కూడా జరగదన్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని లెక్కలు అడగడం విడ్డూరమన్నారు. ప్రభుత్వం ఎటువంటి అవినీతికి పాల్పడలేదు కాబట్టే.. తాము నిజాయితీగా లెక్కలు పంపించినట్లు చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు.
see also : నేనా..! పవన్ కల్యాణ్ పార్టీలోకా..? చ్ఛిచ్ఛీ..!!