సగటు మనిషి సిగ్గుతో తలదించుకునే సంఘటన.మానవత్వం తొక్క తోలు అనేది కేవలం మాటల్లోనే కానీ పాటించడానికి కాదు అని చెప్పడానికి నిలువెత్తు అని నిదర్శనమైన సంఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్నది.స్థానిక పోలీసు అధికారుల సమాచారం మేరకు దాదాపు ఇరవై ఏడు ఏళ్ళ వయస్సున్న మతిస్థిమితం లేని యువకుడు .
see also :బస్సుయాత్రకు ముందే..కాంగ్రెస్‌లో ఓటమి భయం
అతడు రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లాలో అత్తపాడి గ్రామానికి సమీపాన ఉన్న అడవిలో ఉంటూ దుకాణాల్లో కేవలం తినుబండారాలను దొంగిలిస్తూ అవి తింటూ జీవనం సాగిస్తున్నాడని ఊర్లో నలుగురు చెబుతుండటంతో విషయం తెల్సిన స్థానికులు అతడ్ని కట్టేసి మరి కొట్టారు.మతి స్థిమితం లేని యువకుడు అందులో కేవలం తినుబండారాలను దొంగిలిస్తున్నాడని ఇలా అమానుషంగా కొట్టడాన్ని ఆపకుండా యువత సెల్ఫీలు దిగాడటానికి పోటి పడటం యావత్తు మానవ జాతిని సిగ్గుతో తలదించుకునే విధంగా చేసింది.
see also : వరంగల్ నగరంలో మోనోరైలు కోసం అధ్యయనం..!
అంతే కాకుండా దాదాపు కొన్ని గంటల పాటు టార్చర్ పెట్టారు.ఇది చూసి మానవత్వం ఉన్న ఒక వ్యక్తీ పోలీసులకు కబురు పంపడంతో వచ్చి విడిపించారు.అప్పటికే అతడు వాంతులు చేస్కోవడంతో ఆస్పత్రిలో ఐదు గంటల పాటు చికిత్స పొందుతూ చనిపోయాడు అని పోలీసులు తెలిపారు …