ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా బనగానపల్లెలో అనుమానంతో కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా వేటకొడవలితో హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి.. ఆ శవం ముందు కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాడు.
see also..మూడు లక్షల ఫోన్లను 3 నిమిషాల్లోనే షియోమీ రెడ్ మీ 5..!
మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన తెలుగు నాగన్న కుమార్తె మహేశ్వరి (33) సంవత్సరాల క్రితం బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటకు చెందిన పెద్ద పుల్లన్న కుమారుడు లింగమయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.వివాహం జరిగినప్పటి నుండి వీరిద్దరి మద్య గోడవలు జరుగుతూనే ఉండేవి అని తెలిసింది. దీంతో భార్య అలంపూర్ కోర్టులో భర్తపై (మెయింటెనెన్స్) నిర్వహణ ఖర్చులు చెల్లించాలని దావా వేసింది. ఈ కేసు కోర్టులో నడుస్తోంది.
see also..వైఎస్ జగన్ పాదయాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి వచ్చారో తెలుసా..?
అయితే పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగగా, లింగమయ్య భార్య పోషణకు నెల నెలా డబ్బు ఇవ్వాలనే ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బనగానపల్లెలోని తెలుగుపేటలో భర్త ఇంటి సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ముగ్గురు పిల్లలను తన వద్దనే ఉంచుకొని టైలరింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా లింగమయ్య భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
see also..జగన్ నిర్ధోషి.. తెరపైకి ఒరిజినల్ కంపెనీ.. పచ్చ బ్యాచ్‌కి అర్ధమయ్యేలా షేర్లు కొట్టండి..!
మహేశ్వరి ఇంటికి వెళ్లి ఆమెను వేటకొడవలితో నరికి చంపేశాడు. శవాన్ని భుజంపై మోసుకుంటూ వెళ్లి తన ఇంటి వద్ద పడేసి మెట్లపై కూర్చున్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. భార్యను తానే చంపానని ఒప్పుకోవడంతో పోలీసులు లింగమయ్యను అదుపులోకి తీసుకున్నారు.
see also..బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..