Home / TELANGANA / బ‌యో ఏషియాలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ

బ‌యో ఏషియాలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ

ప్ర‌తిష్టాత్మ‌క బ‌యో ఏషియా స‌ద‌స్సులో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గ‌డిపారు. రెండో రోజైన శుక్ర‌వారం ప‌లు ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌తో భేటీ అయ్యారు. జీఈ (సస్టెయినబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్) ప్రెసిడెండ్, సియివో టెర్రీ బ్రెసెన్హమ్ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న  మెడ్ డివైసెస్ పార్కు గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీవర్క్స్ లో జీఈ భాగస్వాములవుతున్నదని ఈ సందర్బంగా మంత్రి ప్రస్తావించారు. బయోటెక్నాలజీలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్జానాన్ని హైదరాబాద్ నగరంలోని కంపెనీలు అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలపైన అమె మంత్రితో చర్చించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం సుమారు ముప్పై లక్షల ల్యాబరేటరీ స్పేస్ ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి టెరీకి తెలిపారు. త్వరలోనే జినోమ్ వ్యాలీ పర్యటనకు వస్తానని టెరీ తెలిపారు.

see also :జ‌గ‌న్ నిర్ధోషి.. తెర‌పైకి ఒరిజిన‌ల్ కంపెనీ.. ప‌చ్చ‌ బ్యాచ్‌కి అర్ధ‌మ‌య్యేలా షేర్లు కొట్టండి..!

తెలంగాణ ప్రభుత్వ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న ఇంక్యూబేటర్ లో జీఈ భాగస్వాములవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన కాన్సర్ డయాగ్నస్టిక్ కార్యక్రమాలను మంత్రి టెరీ కి వివరించారు.  తెలంగాణ ప్రభుత్వ టాస్క్(TASK) తో కలిసి హెల్త్ కేర్ స్కిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టేందుకు జీఈ సిద్దంగా ఉన్నదని టేరీ మంత్రి కెటి రామారావుకు తెలిపారు.

see also :తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ ఉక్కిరి బిక్కిరి..!

థాయ్‌లాండ్ ఉప వాణిజ్య శాఖ మంత్రి చుటిమా బున్యాప్రఫసారాతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన సుమారు 20 కంపెనీలతో కూడిన మంత్రి బృందం తెలంగాణలోని వ్యాపారావకాశాలపైన మంత్రి కెటి రామరావుతో చర్చించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం, ఫార్మా సిటీ, జినోమ్ వ్యాలీ, హైదరాబాద్ నగరంలో ఫార్మ, లైఫ్ సైన్సెస్ రంగంలో ఉన్న అవకాశాలపైన థాయ్‌లాండ్ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. థాయ్‌లాండ్ దేశానికి భారతదేశం కీలకమైన వాణ్యిజ్య సంబంధాలున్న దేశమని తొలిసారి హైదరాబాద్ పర్యటనలోనే ఇక్కడి పాలసీలు, పెట్టుబడి అవకాశాలు తమను అకట్టుకున్నాయని చుటిమా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ టియస్ ఐపాస్ విధానాన్ని ప్రసంశించారు.

భారతదేశంలో ఇటాలియన్ కాన్సుల్ జెనరల్ ఇన్ ముంబాయి స్టేఫానియా కస్టాన్జా తో మంత్రి సమావేశం అయ్యారు. భాద్యతలు చేపట్టిన తర్వతా హైదరాబాద్ నగరంలో తొలిసారి పర్యటిస్తున్న తనకు ఇక్కడి టెక్స్ టైల్ రంగం, ఫార్మా, సినిమా పరిశ్రమ అనుబంద రంగాలలో పెట్టుబడులు అవకాశాలపైన అలోచిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బయోటెక్ రంగంలో ఇటలీ దేశ ఇకో సిస్టమ్ తో ఇక్కడ కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశాలపైన అనేక కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

see also :కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు..!

తెలంగాణ టెక్స్ టైల్ రంగాన్ని ఇటలీలోని అనేక ఫ్యాషన్ రంగాన్ని కలిపేందుకు ఉన్న అవకాశాలపైన ఈ సందర్భంగా మంత్రి కెటి రామారావును అడిగి తెలుసుకున్నారు.  అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎయిరోస్సేస్, టెక్స్ టైల్ రంగాల్లో అనేక పెట్టబడి అవకాశాలున్నాయని, తెలంగాణలో పెట్టుబడులు కోసం ముందుకు వచ్చే ఇటాలియన్ కంపెనీలకు అన్ని విధాలుగా సహాకరిస్తామని, ఈ దిశగా అయా కంపెనీలకు తెలంగాణను పరిచయం చేయాలన్నారు. మంత్రి విజ్జప్తి మేరకు త్వరలోనే ఇటాలియన్ కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఎర్పాటు చేస్తామని, తెలంగాణలోని వ్యాపారావకాశాలు, పారిశ్రామిక విధానాలను తెలియజేస్తామని అమె మంత్రికి హమీ ఇచ్చారు.

భారతదేశంలో ఫార్మ పరిశ్రమ అభివృద్దికి ఉన్న సవాళ్లు అనే అంశంపైన ఫార్మ కంపెనీల సియివోలతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. మెర్క్ లైఫ్ సైన్సెస్  సియివో ఉదిత్ భాత్రా, నోవార్టిస్, డెలాయిట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు.

see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat