తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఈ నెల 26న కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు.కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే రైతు సమన్వయ సమితి సదస్సు కు హాజరై మాట్లాడనున్నారు.ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ… దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
see also :కర్నూలు జిల్లాలో వేటకొడవలితో దారుణ హత్య…భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి
see also :వైఎస్ జగన్ పాదయాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి వచ్చారో తెలుసా..?
ఈ నెల 25న హైదరాబాద్ రాజేంద్రనగర్ లో 14 జిల్లాల రైతు సమన్వయ సమితుల ప్రతినిధుల సదస్సు ఉంటుందని వెల్లడించారు. 26న కరీంనగర్ లో జరిగే సదస్సుకు 15 జిల్లాలకు చెందిన రైతు సమన్వయ సమితి సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు దాదాపు 10 వేల మంది దాకా హాజరవుతారని తెలిపారు.రైతు సమన్వయ సమితుల విధి విధానాలు వివరించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా కరీంనగర్ వస్తున్నట్లు మంత్రి పోచారం చెప్పారు.
see also :పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్రెడ్డిల మధ్య జరిగిన బిగ్ ఫైట్..వీడియో వైరల్
26న ఉదయం ముఖ్యమంత్రి గంటన్నర సేపు రైతులనుద్దేశించి మాట్లాడి… లాభసాటి వ్యవసాయంపై రైతులకు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. మధ్యాహ్నం రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని స్వయంగా సీఎం వారితో మాట్లాడి సందేహాలు నివృత్తి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ ఉంటుందన్నారు.