సాగునీటి ప్రాజెక్టులను ఎలాగైనా పూర్తిచేయాలని కంకణం కట్టుకున్న తెలంగాణ భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆ పనిలో తీరిక లేకుండా ఉన్నారు. కేంద్రం నుంచి అనుమతులు, పనులను ప్రత్యక్షంగా పరిశీలించడం, అధికారులకు ఆదేశాలివ్వడం ఆయన జీవిత విధానంగా మారిపోయింది. ఈ బిజీ పనుల్లోనూ ఏ మాత్రం విశ్రాంతి దొరికినా ఆ సమయాన్నీ మళ్లీ ‘నీళ్ల’కే కేటాయిస్తున్నారు.
see also :మంత్రి కేటీఆర్ పై మహిళా పారిశ్రామికవేత్త ప్రశంస
see also :భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అమ్రపాలి దంపతులు
ఈ రోజు హైదరాబాద్‌లో కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట జరిగిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాదనలు వినడానికి ఆయన స్వయంగా హాజరయ్యారు. ఏపీ ఏం చెబుతోంది, తెలంగాణ అధికారులు ఎలా వాదిస్తున్నారని ఆసక్తి విన్నారు. ఒక వీఐపీలా ముందు వరుస సీట్లలో కాకుండా వెనకవైపు ఒక సామాన్య ప్రేక్షకుడిలా కూర్చున్నారు. ఏపీ, తెలంగాణ అధికారులు ఇస్తున్న సమాచారాన్ని ఆయన బేరీజు వేసుకుంటున్నట్లు కనిపించారు. ఫోన్ కూడా స్విచాఫ్ చేసుకుని చాలాసేపు కూర్చున్నారు.. నీటిపై హరీశ్ పట్టుకు ఈ సన్నివేశం ఒక తాజా ఉదాహరణ అని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.