తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత జరిగిన సింగరేణి ఎన్నికల్లో కార్మికులందరు TGBKS ( తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ) కు పట్టం కట్టిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ,టీఆర్ఎస్ పార్టీ అధినేత సింగరేణి యాత్ర పేరుతో యాత్ర చేస్తా అని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే..ఈ మేరకు ఈ నెల 27 న రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు వెళ్లనున్నారు.
see also : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గెలిపించేది ఏమిటంటే..!
see also :ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!!
సింగరేణి వ్యాప్తంగా ప్రారంభానికి సిద్దంగా ఉన్నా 6 బొగ్గు బావులను ప్రారంబించి..శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియం లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.అయితే ఈ బహిరంగ సభలో సింగరేణి కారుణ్య నియామకాల విషయంలో కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.అంతేకాకుండా బొగ్గుగని కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు కురిపించే అవకాశం ఉనదని సమాచారం.అంతే కాకుండా రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ,మారు పేర్లతో విధులు నిర్వహిస్తున్న వారిపై ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు .tgbks నేతలు స్పష్టం చేస్తున్నారు.
see also : హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
see also :వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!