దేశ వ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో ఉత్తరప్రదేశ్ లోఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడ ఒక్క చోట ప్రతి రోజు ఖచ్చితంగా మహిళలపై రెప్ లు, హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా 18 ఏళ్ల అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామం శివారుల్లో అత్యంత దారుణంగా కాలిపోయిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె తన సైకిల్‌పై మార్కెట్‌కు వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. ‘ఆమె శరీరం వంద శాతం కాలిపోయింది. మృతదేహం పక్కనే సైకిల్ పడిపోయి ఉంది. ఆమె చెప్పులు, ఖాళీ పెట్రోలు డబ్బా, అగ్గిపుల్లలు ఆ పక్కనే కనిపించాయి. సజీవదహనం చేసినట్లు అనిపిస్తోంది’ అని పోలీసులు వెల్లడించారు. ఘటనపై హత్య కేసు నమోదు చేశామని, ఆమెపై లైంగిక దాడి జరిగిందా లేదా అనే అంశం పోస్ట్‌మార్టం అనంతరం తెలుస్తుందని చెప్పారు.
see also..వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..!
నిన్న సాయంత్రం 4.30 సమయంలో కూరగాయలు తేవడానికి తను సైకిల్‌పై మార్కెట్‌కు వెళ్లగా, తర్వాత గ్రామం బయట కాలిపోయిన స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. ఈ వార్త తెలిసి ఆ అమ్మాయి కుటుంబ సభ్యలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సైకిల్, చెప్పుల ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు. ఘటనకు పాల్పడిన వారి వివరాలు, ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. నిందితుల కోసం గాలిస్తున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
see also..మూడు లక్షల ఫోన్లను 3 నిమిషాల్లోనే షియోమీ రెడ్ మీ 5..!