ఇతర పట్టాదారులతో పాటుగానే అసైన్డ్ భూములు కలిగిన వారికి కూడా ఖచ్చితంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ముఖ్య మంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అసలు లబ్దిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి, వాటి యాజమాన్యంపై స్పష్టత నివ్వాలని, వారి పేరు మీద పాస్ పుస్తకాలు తయారు చేయాలని ఆదేశించారు.
see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..!
see also :మంత్రి కేటీఆర్ పై మహిళా పారిశ్రామికవేత్త ప్రశంస
పాస్ పుస్తకాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతీ ఎంట్రీని ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి తొందరపాటు అవసరం లేదని సి.ఎం. చెప్పారు. వ్యవసాయ భూమి కలిగిన రైతులకు అదే గ్రామంలో వ్యవసాయేతర భూమి ఉంటే, ఆ వివరాలు కూడా పాస్ పుస్తకంలో నమోదు చేయాలని, అందుకోసం అదనపు కాలమ్ పెట్టాలని సి.ఎం. ఆదేశించారు. పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు నెంబర్ కూడా ఖచ్చితంగా అనుసంధానం చేయాలనీ చెప్పారు.
see also :భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అమ్రపాలి దంపతులు
see also : బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..