వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న జరిగిన మీడియా సమావేశంలో మంత్రి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేవలం ఒక్క జగన్ మోహన్‌రెడ్డి వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారన్నారు. జగన్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి అయితే రెచ్చిపోయి, పరిధిదాటి మాట్లాడుతున్నారన్నారు. ఐఏఎస్ అధికారులపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ప్రభుత్వం ఖండిస్తుందన్నారు.
see also : మెగా హీరో ఇల్లీగల్ ఎఫైర్.! సోషల్ మీడియాలో ఫోటోతో సహా..!!
see also : ఆనాడు రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి పనిలో పెట్టుకున్న రేష్మి..కారణం తెలుసా..!
అయ్యా విజయసాయిరెడ్డి మీరు చేసిన పుణ్యానికి, జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని నాడు చేసిన పాపాలకు ఇవాళ 12 మంది ఐఏఎస్ స్థాయి అధికారులు బోనులో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఇకనైనా మీ తప్పుడు ఆలోచనలను మానుకుని సరైన మార్గంలో నడవండి, ప్రజలు క్షమిస్తారంటూ ఎద్దేవ చేశారు.
see also : సుప్రీం హీరో పతనం కన్ఫాం..! ఫిక్స్ చేసిన పెద్దన్న..!!