టైక్వాండో జాతీయ అకాడమీ ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తామని మంత్రులు పద్మారావు,హరీశ్ రావు చెప్పారు. టేక్వాండో ‘ఛాంపియన్ షిప్ పోటీలలో 3 బంగారు పతకాలు సాధించడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు.
see also : ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి…
ఈ మేరకు టైక్వాండో కు తెలంగాణలో ఉన్న భవిష్యత్తు అవకాశాలు, ప్రభుత్వపరంగా కావలసిన సహకారం,జాతీయ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు,ఇలాంటి అకాడమీ వల్ల క్రీడారంగంలో లభించే ప్రయోజనాలు,2024 లో పారిస్, 2028లో లాస్ ఏంజిల్స్ లోనూ జరగనున్న ఒలంపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం వంటి పూర్తి వివరాలతో ప్రతిపాదనలను క్రీడల మంత్రి పద్మారావు కు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు సూచించారు. డల్లాస్ లో జరిగిన పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు క్రీడల మంత్రి పద్మారావు ప్రకటించారు.
SEE ALSO : మంత్రి కేటీఆర్‌కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య ప్రశంస