కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని వసతులున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చుతామని చెప్పారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో నేడు ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీలో ఉన్న వసతులు పరిశీలించారు. బోధనా తీరుపై, విద్యావిధానంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉమెన్స్ కాలేజీ పరిసరాలను, భవనాలను తిరిగి చూశారు. హైదరాబాద్ నడిబొడ్డున 40 ఎకరాల్లో విస్తరించిన ఈ కాలేజీలో బోధనావసతులు బాగున్నాయని, కాలేజీ వాతావరణం విద్యార్థులకు అనుగుణంగా ఉందని కాలేజీలో మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కాలేజీలో రాష్ట్రంలోని 31 జిల్లాల విద్యార్థులున్నారని, వీరితో పాటు విదేశాలకు చెందిన చాలా మంది విద్యార్థినిలు కూడా చదువుతున్నారని చెప్పారు.
see also : ఎండా కాలంలో నీటి కష్టాలు ఉండవు..మంత్రి పద్మారావు
see also : అవినీతి చేసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడనే వీడియో హల్ చల్
ఉమ్మడి రాష్ట్రంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒకటి ఉండగా, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిందన్నారు. దీంతో తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం లేకుండా పోయిందన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, కేంద్రం ఇందుకు తగిన సాయం చేయాలని కోరినట్లు వివరించారు. ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీని చూసిన తర్వాత తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం చేయడానికి కావల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయని గుర్తించామన్నారు. దీనిని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయంగా మార్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఇందుకోసం నెల రోజుల్లో ఇక్కడ మహిళా విశ్వవిద్యాలయం ప్రారంభించడానికి కావల్సిన మౌలిక వసతులు, సదుపాయాలపై నివేదిక ఇవ్వమని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
see also :వైసీపీలోకి ఫిరాయింపు ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..!
see also : సుప్రీం హీరో పతనం కన్ఫాం..! ఫిక్స్ చేసిన పెద్దన్న..!!
ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీలో 42 యు.జి కోర్సులు, పీజీ కోర్సులు నడుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఒక్క పరిశోధన మాత్రమే లేదని, విశ్వవిద్యాలయంగా మారితే పరిశోధన కూడా ప్రారంభం అవుతుందన్నారు. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ 200 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీగా ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజీకి 37 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. దీంతో ఆయా భవనాల మరమ్మత్తులు కొనసాగుతున్నాయన్నారు. అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత కావల్సిన ఇతర వసతులు కూడా కల్పిస్తామన్నారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తనిఖీలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసి రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రశాంత్ ఆత్మ, కాలేజి అధికారులు, సిబ్బంది ఉన్నారు.