సంక్షేమ పథకాలు రాజకీయ లబ్ధికోసం కాదు, ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడం కోసమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన రోటీ -కపడా- ఔర్ మకాన్ నినాదాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు.
నూటికి డెబ్భైమందికి పైగా నివసించే గ్రామాలను మార్చితే తప్ప ‘రోటీ కపడా ఔర్ మకాన్’ సాధ్యం కాదని కేసీఆర్ బలంగా నమ్మినందుకే తాగునీరు, సాగునీటికి పెద్ద పీట వేశారు. రోటీ -కపడా మకాన్… ఈ మూడింటికీ వ్యవసాయమే మూలం.వ్యవసాయానికి సాగునీరే ఇరుసు. 44నెలల కేసీఆర్ పాలనలో గ్రామీణ ప్రాంతాలతో ముడిపడి ఉన్న సాగునీటి రంగంలో అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అందరిలా కేసీఆర్‌కు రెండు కళ్ళు కాదు, ఆరు కళ్ళు ఉన్నవి. మంత్రులు హరీశ్ రావు, తారక రామారావుల చూపు కూడా ఆయనకు తోడైంది. ముగ్గురూ ఎవరికి వారే సమర్థులు. ప్రత్యర్థులను మాటలతో చిత్తు చేయగలరు.
see also :21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..!
‘ఆంధ్రాలో గోదావరి నీళ్ళు పారించిన వాళ్ళు తెలంగాణలో రక్తం పారించారు. కరీంనగర్‌ను కల్లోలిత ప్రాంతంగా ముద్ర వేసి అభివృద్ధి జరగకుండా చేశార’ని కరీంనగర్ బహిరంగసభలో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగినప్పుడు టి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తల్లో, జనంలో వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఇప్పటికే ప్రతిపక్షాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను తన వ్యూహ రచనతో కేసీఆర్ తునాతునకలు చేశారు. ఒక మనిషిని వెయ్యి ఏళ్లు గుర్తుపెట్టుకోవాలంటే ఆయన వందేళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు. చేసే ఒక్కపనైనా సరిగ్గా చేస్తే అతను భావి తరాలకు దేవుడిగా మిగిలిపోతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పనిలోనూ నిబద్ధుడై సాగుతున్నారు. సమకాలీన రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక శైలి.
see also : ”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
ప్రతి పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టాలన్నది, ఒంటినిండా బట్టలు ఇవ్వాలన్నది, ఉండటానికి ఓ ఇల్లు కట్టించాలన్నది ఆయన ఆశయం. రోటీ కపడా మకాన్ నినాదాన్ని వాడుకొని గతంలో ఎంతో మంది అధికారం చెలాయించారు. దాని లక్ష్యం మాత్రం వంద శాతం పూర్తికాలేకపోయింది. ఆ నినాదాన్ని ఓ యాభై శాతం చిత్తశుద్ధితో అమలు చేసినా రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావు. రోటీ కపడా ఔర్ మకాన్ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు ఓట్లు దండుకునే ప్రయత్నం చేశాయి. ముఖ్యమంత్రులెవ్వరూ కేసీఆర్ మాదిరి ఆలోచించ లేదు. సంక్షేమ- అభివృద్ధి పథకాలు నాడు కూడా ఉన్నాయి. కానీ వాటి అమలు తీరులోనే స్పష్టమైన మార్పు నేడు కనిపిస్తున్నది. పథకాలు రాజకీయ లబ్ధి కోసం కాదు, ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడం కోసమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన రోటి- కపడా- ఔర్ మకాన్ నినాదాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు.
see also : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ..హైదరాబాద్‌లోని ఓ మోస్ట్ సెలబ్రిటీ హత్యకు పక్క ప్లాన్
ఎక్కడా ఆయన ఈ నినాదాన్ని ఉపయోగిం చకపోయినా, నూటికి నూరు శాతం ప్రజల బతుకు చిత్రాన్ని మార్చాలంటే కనీస అవసరాలు తీర్చాలని అనుకున్నారు. రేషన్ దుకాణంతో పల్లె ప్రజలకు, పేదవాడి కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు రేషన్ షాపులో దొరికే వస్తువులే ఆధారం. గత ప్రభుత్వాలు సీలింగు పెట్టి, నాణ్యత లేని బియ్యం పోసి, పేదవాడిని అర్థాకలితో ఉంచేవి. ఇంట్లో పెద్దలు పస్తులుండి, పిల్లల కడుపు నింపే ప్రయత్నాలు జరిగేవి. కడుపు నిండా తిండిపెడతామని అధికారంలోకి వచ్చిన వాళ్లకు ఇవేవీ పట్టేవి కావు. ఇచ్చిన బియ్యమే బంగారం అన్నట్టు ప్రచారం చేసుకునేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఒక్కొక్కరికీ ఆరు కిలోల బియ్యం ఇస్తున్న ఘనత కేసీఆర్‌దే. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం పోసి… మూడుపూటలా పట్టెడు అన్నం దొరికేలా చూసిన నాయకుడు కేసీఆర్.
see also : జబర్ధస్త్‌లో సుధీర్ టీమ్ ఫెయిల్.. గెటప్ శీను సంచలన వ్యాఖ్యలు |
ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర ఉన్న ఉల్లి పండించే రైతుల సంక్షోభాన్ని కేసీఆర్ సూచనలతో మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు సులువుగా పరిష్కరించి, ఆదుకొన్నారు. బహుశా దేశంలోనే మరే ప్రభుత్వం కూడా ఉల్లి కష్టాలను గుర్తించకముందే తెలంగాణ ప్రభుత్వం మేల్కొంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ కౌంటర్లు తెరచి, సబ్సిడీ ఉల్లిపాయలను అందించారు. కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటిన సందర్భంలోనూ తెలంగాణ ప్రభుత్వం చతురత ప్రదర్శించింది. విద్యార్థులు భావి పౌరులు. అలాంటి విద్యార్థులు కూడా ఉడికీ-ఉడకని, పురుగులుపడిన అన్నం తినలేక, బోరింగు నీళ్లు తాగి కడుపు నింపుకునే వారు. స్వయంగా బీసీ హాస్టల్ లో ఉండి చదువుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ చొరవతో హాస్టళ్లలో సన్న బియ్యంతోనే అన్నంపెట్టాలని సీఎం నిర్ణయించారు. అర్థాకలితో చదువుకుంటే అది వంట బట్టదని, మన భావితరాలను మనమే చిదిమేస్తే ఎలా అని ఆయన అనుకున్నారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ప్‌రభుత్వాలు ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే పరిగణించేవి. ఒక ప్రభుత్వ హయాంలో యాభై రూపాయలు ఇస్తే, మరొకరు రెండొందలు ఇచ్చారు. నిజానికి సగటు మనిషి కనీస అవసరాలకు నెలకు రెండొందలు సరిపోతాయా? కనీస అవసరాలైన బట్టలు, రోగాలబారిన పడినవారు మందులు ఎలా కొనుక్కుంటారు? ఎలా జీవితం నెట్టుకొస్తారు? ఇలా ఏ పాలకుడు ఆలోచించలేదు. సంక్షేమం అంటే హుందాగా ఉండాలని, పేదలకు, వృద్ధులకు ప్రభుత్వం ఆసరాగా ఉండాలని కేసీఆర్ భావించారు.
see also :భర్త మరో మహిళతో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందో తెలుసా
ఉద్యమం జరుగుతున్నప్పుడే, కనీసం ప్రభుత్వ ఏర్పాటు మీద ఎలాంటి అంచనాలు లేనప్పుడే వృద్ధులు,- వితంతువులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు పది హేను వందల రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పారు. అప్పుడు చాలామంది అవహేళన చేశారు. బ్యాంకులకు కన్నం వేస్తారా? అని ప్రశ్నించిన వాళ్లను కూడా చూశాం. కానీ అదే కేసీఆర్ ఇప్పుడు ముప్పై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంటే, నాడు విమర్శించిన వారు ముక్కున వేలేసుకొని చూస్తున్నారు.
ఒక పూట తిన్నా, పస్తులు పడుకున్నా, ఒంటి నిండా బట్ట కట్టుకోకున్నా, తలదాచుకోవటా నికి ఓ గూడు మాత్రం ఖచ్చితంగా ఉండాలన్న ఆలోచన నుంచే డబుల్ బెడ్ రూమ్ ఆవిష్కృతమైంది. కూడు- గుడ్డగూడు అనే నినాదం అందులోంచి పుట్టుకొచ్చిందే. ఇందిరాగాంధీ హయాంలో మొదలైన ఈ పథకాలు.. ఇప్పటికీ ఇంకా పథకాలుగానే కొనసాగుతున్నాయి. పేపర్ లెక్కల్లో మాత్రం లక్షల ఇండ్లు కట్టించినట్టు చూపిస్తారు. తెలంగాణ ప్రజలకు అలాంటి అగత్యంలేదు. ఈ పీడ సమైక్య పాలన తోనే విముక్తమైపోయింది. పేదవాడు పేదవాడిగా వందల జన్మలు ఎత్తినా సొంతంగా కట్టుకోలేని ఇళ్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రెండు బెడ్ రూములు, ఒక హాలు, మోడల్ కిచెన్‌తో కూడిన ఒక ఇంటిని బహుమతిగా అందిస్తోంది. ఇది ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా జరగని ఒక అద్భుతం. అయితే కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం ఆశించినంత వేగంగా అమలు కావడం లేదు. ఇంకా కొన్ని బాలారిష్టాలు ఉన్నవి. దళితులకు మూడెకరాల భూ పంపిణీ కూడా అమలులో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది.
see also : వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!
ప్రపంచ యవనికపై కేసీఆర్ ప్రతిష్ట ఇనుమడిస్తున్నది. పలు సందర్భాల్లో విదేశాల నుంచి ఆహ్వానాలు కేసీఆర్ కు అందుతున్నవి. కేసీఆర్ చేపట్టిన విధానాలు వాతావరణ మార్పుల సమస్యకు పరిష్కారం చూపుతాయని అమెరికాలోని కాలిఫోర్నియా గవర్నర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ శతాబ్దాంతానికి గ్లోబల్ వార్మింగ్‌ను రెండు డిగ్రీల వరకు తగ్గించాలన్న ప్రపంచ దేశాల లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా కేసీఆర్ సర్కార్ విధానాలు ఉన్నాయన్నారు. కాలిఫోర్నియా, తెలంగాణ రాష్ట్రాలు వర్షాభావం, గ్రీన్ కవర్ తగ్గడం వంటి ఒకే రకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మిషన్ కాకతీయను గురించి చెప్పనక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వానికే ఇపుడు ఇది రోల్ మోడల్ పథకం. మిషన్ కాకతీయ స్ఫూర్తితో ముందుకు కదిలిన కేంద్రం దేశవ్యాప్తంగా ఐదు లక్షల వాటర్ పాండ్స్ (నీటి కుంటలను) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది మన మిషన్ కాకతీయకు దక్కిన గౌరవం. దేశ విదేశాల నుంచి వచ్చి మిషన్ కాకతీయ మీద పరిశోధనలు కూడా చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ప్రతిపాదన దశలో ఉండగానే బీహార్‌లో ఎన్నికల ప్రచార అస్త్రంగా మలచుకుని నితీష్ కుమార్ బీహార్ సీఎం పీఠం దక్కించుకున్నాడు. నీతిఆయోగ్ కూడా మిషన్ భగీరథను రోల్ మోడల్గా తీసుకొని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాసింది.
see also :బీజేపీలో విలీనం చేయాల్సిందే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు |
కరెంటు విషయంలో కేసీఆర్ ముందు చూపును విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. విభజనను వ్యతిరేకించి, కేసీఆర్‌ను తూలనాడిన కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పాలన భేష్ అంటూ కితాబిచ్చారు. ఇరిగేషన్ పాలసీ మీద సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, అంతా నివ్వెరపోయారు. ఎదురు మాట్లాడలేక, ఆయన దార్శనికతకు దాసోహం అయ్యారు. ఏండ్లకుఏండ్లు అధికార పీఠాన్ని పట్టుకొని కూర్చుకున్న మహామహులు చెయ్యలేని పనిని తన శైలిలో చేసి చూపించి కేసీఆర్ అద్భుతాలు సృష్టిస్తున్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ. ఆ పాపం టి.ఆర్.ఎస్‌దేనని నెట్టివేయడానికి విపక్షాలు చేసే ప్రయత్నాలు ఫలించవు. రైతుల ఆత్మహత్యలకు విరుగుడు సాగునీటి కల్పన అని 2001లో పార్టీ ఆవిర్భావం సమయానికే కేసీఆర్‌కు అవగాహన ఉన్నది. రైతాంగం పట్ల ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యాన్ని ముందుగా సరిదిద్దవలసి ఉన్నది. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వవలసి ఉన్నది. ఆన్ గోయింగ్ పథకాలను పూర్తి చేయవలసి ఉన్నది. అటు కాళేశ్వరం, మరోవైపు పాలమూరు, రంగారెడ్డి, సీతారామా ప్రాజెక్టులు ఊపుమీద ఉన్నవి. కాళేశ్వరం గురించి మాటల్లో చెప్పడం కష్టం. దగ్గరకు వెళ్లి చూడవలసిందే. ప్రాజెక్టులకు ప్రధాన అడ్డంకి భూసేకరణ. పైగా చంద్రబాబు నాయుడి హయాంలో మొగ్గ తొడిగిన భూముల బూమ్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వేగం పుంజుకున్నది.
see also : ఇప్పుడు తెలుగులోనూ ఈ-మెయిల్ అడ్రస్..!
భూములు కోల్పోతున్న రైతులు ఎక్కువ రేటు కోరతారు. పరిహారంతో పాటు, పునరావాసం వంటి చర్యలకు ఖర్చు బాగా పెరుగుతుంది. ఇది అనివార్యం. ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెరవకుండా ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించిన కారణంగానే దాని ఫలితాలు కనిపిస్తున్నవి. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల దశ-దిశనుసైతం కేసీఆర్ రీడిజైనింగ్‌తో మలుపు తిప్పారు. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో రైతుల పరిస్థితి మెరుగ్గా ఉంది. రిజర్వాయర్లు పొంగాయి. మిషన్ కాకతీయ పుణ్యమా అని చెరువులు మత్తడి దుమికాయి. రైతుల్లో సంతోషం కన్పిస్తున్నది. యాసంగిలోకూడా దిగుబడులు పెరగనున్నాయి. వాటికి మద్దతు ధర కల్పించేందుకు మార్కెటింగ్ రంగం నడుం బిగించింది.
సోర్స్ : సీనియర్ జర్నలిస్టు ఎస్.కె. జకీర్