ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుపై రాష్ట్ర మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పలు ఆధారాలతో అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో రాజధాని పేరిట పలు కుంభ కోణాలు ,అవినీతికి పాల్పడుతున్నారు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also..ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!!
గత మూడున్నర ఏండ్లుగా సర్కారు చేస్తున్న అవినీతి అక్రమాలు ,ప్రభుత్వ పర లోపాలను ,ప్రత్యేక హోదా విషయంలో బాబు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకై ప్రశ్నించారు.దీంతో గతంలో బ్రాహ్మణ కార్పోరేషన్ పదవి నుండి తప్పించారు.తాజాగా అర్చకుల ,ఉద్యోగుల సంక్షేమ ఫండ్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుండి కూడా తప్పిస్తూ ఉత్తర్వులను జారిచేశారు.
see also..”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
అయితే బాబు నేతృత్వంలో టీడీపీ సర్కారు చేస్తున్న అవినీతి అక్రమాల గురించి బాహాటంగా ప్రశ్నిస్తున్నందుకే ఇలా ఐవైఆర్ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.పదవి ల నుండి తప్పిస్తూ బాబు చుక్కలు చూపిస్తున్నారు.ఐవైఆర్ మాజీ ఐఏఎస్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి.ఐవైఆర్ వెంట దేవుడున్నాడని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.