తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు అంతా రెడీ అయ్యింది. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు.. బయో-ఏసియా సదస్సు జరగనుంది. సాయంత్రం HICCలో సదస్సును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సదస్సులో 50కి పైగా దేశాల నుంచి 12 వందల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రేపటి సెషన్ లో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుతో పాటు …రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న మార్పులపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. సదస్సు సందర్భంగా ప్రతి ఏడాది అందించే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును… స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మిచెల్- ఎన్ హాల్ కు సీఎం కేసీఆర్ అందజేయనున్నారు.
see also :25 ఏండ్ల రికార్డు బ్రేక్ చేసిన కేటీఆర్..!
see also :రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్