ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు గుడ్ బై ఇతర పార్టీలోకి చేరుతున్నారు.ఇటివల టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మరిచిపోకముందే మాజీ సీనియర్ మంత్రి అయిన ఉమామాధవరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తాజాగా కొత్తకోట దయాకర్ రెడ్డి ,ఆయన సతీమణి సీత ఇద్దరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు అని వార్తలు వస్తున్నాయి.
See Also:అవినీతి చేసుకోమని చంద్రబాబు నాయుడే చేస్కోమన్నాడు-ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు …వీడియో..
ఆ భేటీ సందర్భంగా రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ జిల్లాలో దేవకద్ర.మక్తల్ నియోజక వర్గాలను కేటాయిస్తే పార్టీ మారడానికి సిద్ధమని చెప్పనున్నారు అని బాబు అనుకూల మీడియా అయిన పచ్చ మీడియా ప్రత్యేక కథనాలను వడ్డించి ప్రసారం చేస్తుంది.దీంతో వారిద్దరూ పార్టీ మారడానికి రంగం సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో టాక్.ఇప్పటికే రేవంత్ ,ఉమా మాధవరెడ్డి లాంటి నేతలను కోల్పోయిన బాబుకు ఇది బిగ్ షాక్ ..