ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 95వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. గురువారం ఉదయం అనగా(22-02-2018)న వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రామాపురం, గుడేవారిపాలెం క్రాస్, హజీస్ పురం మీదగా పాదయాత్ర కొనసాగనుంది.దారిపొడవునా మహానేతకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్ర షెడ్యూల్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. గత 94 రోజులుగా వైఎస్ జగన్ 1275.9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.