తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మూడు రోజులపాటు జరిగిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ విజయవంతం అయ్యిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు . ఈ సదస్సు ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదికయ్యిందని తెలిపారు. హెచ్ఐసిసిలో వరల్డ్ ఐటి కాంగ్రెస్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.వరల్డ్ ఐటి కాంగ్రెస్ ఇంత ఘనంగా ఎప్పుడూ జరగలేదని ఐటి కాంగ్రెస్, నాస్కామ్ ప్రతినిధులు ప్రశంసించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ ఆతిథ్యంపై ప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారని తెలిపారు.
And the amazing, enlightening and insightful journey of #WCITIndia2018 #NASSCOM_ILF officially ends.
See you next year!#Hyderabad, thank you for being such a great host! pic.twitter.com/KYw5oTSD7w— Nasscom Events (@NasscomEvents) February 21, 2018
వరల్డ్ ఐటి కాంగ్రెస్ వేదికగా రెండు ఒప్పందాలు జరిగాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం చేసుకుందన్నారు. డాటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు ఇది ఫెసిలిటీ సెంటర్ గా ఉంటుందన్నారు. దీంతోపాటు, హైదరాబాద్ నగరంతో తైవాన్ లోని తోయువాన్ నగరం మధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు. ఐవోటీ సేవల విషయంలో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఒప్పందాలతో పాటుగా హైదరాబాద్ లో అడోబ్ కేంద్రం ఏర్పాటుకు ఈ సదస్సు వేదికగా నిర్ణయం జరిగిందన్నారు.
A Technology Partnership MoU was exchanged between the Government of Telangana State and Taoyuan City, Taiwan, in the presence of Minister for IT & Industries @KTRTRS on the sidelines of #WCITIndia2018 pic.twitter.com/4dtSAycvUB
— Min IT, Telangana (@MinIT_Telangana) February 21, 2018
రేపటి నుంచి నెల రోజుల్లోపు మరో మూడు ప్రతిష్టాత్మక సదస్సులకు హైదరాబాద్ వేదిక అవుతోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 24 వరకు బయో ఏషియా సదస్సు జరుగుతుందని చెప్పారు. ఇందులో లైఫ్ సెన్సెస్ రంగానికి చెందిన 300 మంది ఉన్నతస్థాయి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఈ-గవర్నెన్స్ పై జాతీయ సదస్సు జరుగుతుందన్నారు. మార్చి 8 నుంచి 11 వరకు విమానయాన రంగానికి చెందిన వింగ్స్ ఇండియా సదస్సు నిర్వహిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ వివరించారు.టీ-హబ్ రెండో దశను త్వరలోనే ప్రారంభిస్తామని, మహిళా పారిశ్రామికవేత్తల కోసం మార్చి 8న వి-హబ్ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.