రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కానీసం ప్రతిపక్ష హోదా కుడా దక్కదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ పదవులు కాపాడుకునేందుకే బస్సు యత చేస్తుందని అయన అన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ యాత్రలు చేసినా జనాలు నమ్మరన్నారు .పాలమూరును వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేలా ఆయకట్టును పెంచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యాలు చేయడం మానుకోవాలన్నారు. లేదంటే ప్రజలే తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు.
see also : రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్