తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు రానున్నది. తెలంగాణలో విప్రో సంస్ధ తన మాన్యూఫాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నది. వరల్డ్ ఐటి కాంగ్రెస్ సందర్భగా విప్రో సంస్ధ ఛీఫ్ స్ర్టాటెజీ అఫీసర్ రిషద్ ప్రేమ్ జీ తో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే తాము తెలంగాణలో ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి రిషద్ ప్రేమ్ జీ తెలిపారు.
విప్రొ కన్యూమర్ కేర్ ప్రొడక్ట్స్ విభాగం అద్వర్యంలో సబ్బులు, మరియు ఇతర సౌందర్యసాధనాల తయారీ కేంద్రాన్ని మహేశ్వరం మండలంలో ఏర్పాటు చేయనున్నట్లు అయన తెలిపారు. ఇందుకోసం సూమారు 220 కోట్ల రూపాయాల పెట్టుబడిని విప్రొ పెట్టనున్నది. మెత్తం 40 ఎకరాల్లో నిర్మించనున్న ఈ తయారీ పరిశ్రమ నేరుగా 300 వందల మందికి, పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి కల్పించనున్నది. ఇప్పటికే విప్రొ సంస్ధ ఇతర విభాగాల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని, నూతనంగా ఈ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన విప్రొ సంస్ధకు మంత్రి కెటి రామరావు ప్రత్యేకంగా దన్యవాదాలు తెలిపారు.
Wipro Consumer Care products division has decided to invest Rs 220Cr to set up a manufacturing unit for personal care products
Thanked Rishad Premji, Director, Wipro Enterprises when I met him on the sidelines of #WCITIndia2018 #NILF2018 pic.twitter.com/oGOs6jrWvI
— KTR (@KTRTRS) February 21, 2018