తమకు విద్యాబుద్దులు నేర్పిన టీచర్‌నే ఏడో తరగతి చదువుతున్న బాలుడు రేప్ చేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా ఆ టీచర్ కుమార్తెను కూడా రేప్ చేస్తానన్నాడు. దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలో ఉండే ఈ ఘటన గురుగ్రామ్‌లోని ఓ ప్రముఖ పాఠశాలలో జరిగింది. ఈఘటనతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రంగంలోకి దిగింది.
see also..ఫిరాయింపు బ్యాచ్‌కి బంపర్ ఆఫర్.. జగన్ షాకింగ్ డిసిషన్..!
అయితే ఇదే స్కూలో వారం రోజుల్లోనే ఇలాంటి ఘటన ఇది రెండోది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన క్లాస్ టీచర్‌కు ఓ మెయిల్ పంపాడు. తనతో క్యాండిల్‌లైట్ డేట్‌కు రావాలని, సెక్సులో పాల్గొనాలని కోరాడు. ఈ రెండు ఘటనలతో స్కూలు యాజమాన్యం మేల్కొంది. లోయర్ మిడిల్ స్కూల్ విద్యార్థి ప్రమేయం ఉందని ,టీచర్‌కు అభ్యంతరకరంగా ఇంటర్నెట్ ద్వారా మెసేజ్‌లు పంపారని ఆరోపిస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నాం. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సస్పెండ్ చేయడంతోపాటు కౌన్సెలింగ్ కూడా ఇస్తాం. ఇలాంటి చర్యలపై స్కూలు పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది’ అని పాఠశాల ఒక ప్రకటనను విడుదల చేసింది.
see also..హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ ఘటనలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ శకుంతల ధుల్ స్పందించారు. ఈ రెండు ఘటనలను సుమోటోగా తీసుకొని విచారిస్తామన్నారు. విద్యార్థులకు, పాఠశాలకు నోటీసులు పంపామని, వారిని విచారణకు పిలిచి ఘటనలపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ కౌన్సెలింగ్ ఇస్తామని స్పష్టం చేశారు.
see also..వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!