ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని..అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ లేనిపోని మోసపూరిత హామీలన్ని ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు అంటున్నారు. జిల్లాలోని నంద్యాల్లో వీఆర్, ఎన్‌ఆర్ ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశానికి నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి , వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్యప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, తదితర పథకాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. మళ్లీ వైఎస్సార్ పాలన రావాలంటే వైఎస్ జగన్ తోనే సాధ్యమన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో 14 సీట్లు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
see also..హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
see also..వైసీపీలోకి 40వేలమందితో మాజీ ఎమ్మెల్యే…జగన్ గ్రీన్ సిగ్నల్…