తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఆండ్ సర్వీస్ అసోసియేషన్ (నాస్కాం)కు చెందిన 25 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల పరిశ్రమకు చెందిన సంస్థల అత్యున్నత సమన్వయ వేదిక అయిన నాస్కాం తన ఇండియా లీడర్‌షిప్ ఫోరంను మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం మంత్రి కేటీఆర్ ఖాతాలో ఈ ప్రత్యేకతను జోడించిందని అంటున్నారు. ఈ విషయాన్ని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం సందర్భంగా ఆర్.చంద్రశేఖర్ మాట్లాడుతూ 25 ఏళ్లకు నిర్వహిస్తున్న నాస్కాం ఇండియా లీడర్‌షిప్ ఫోరం చరిత్రలో మొట్టమొదటి సారిగా ముంబైని వదిలి మరో నగరాన్ని ఈ ముఖ్య సదసుకు వేదికగా నిర్ణయించామని.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రయత్నం, పనితీరు వల్ల హైదరాబాద్‌లో నిర్వహించామన్నారు. నాస్కాం ఇండియా లీడర్‌షిప్ ఫోరం ఏర్పాటుకు సిద్ధమైన క్షణం నుంచి విజయవంతంగా పూర్తయ్యే వరకు మంత్రి కేటీఆర్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు.
see also : రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరిశ్రమను ముందుకు తీసుకుపోతున్న తీరును గుర్తించి తాము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాబోయే తరంలో ఉద్యోగాల కల్పన, భవిష్యత్‌ను మార్చే 8 సాంకేతిక విప్లవాలను గుర్తించామని వాటిలో కీలకమైన డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన కేంద్రం హైదరాబాద్‌లో కొలువుదీరనుందని తెలిపారు. కాగా, వరల్డ్ ఐటీ కాంగ్రెస్, ఎన్‌ఐఎల్‌ఎఫ్ సదస్సుల సందర్భంగా పలువురు ప్రముఖులు మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి కీలక సమన్వయకర్తగా వ్యవహరించిన ఎన్‌ఐఎల్‌ఎఫ్ చైర్మన్ సీపీ గుర్నానీ తన ప్రారంభ ఉపన్యాసంలో ‘తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి కేటీఆర్ సహాయం లేకపోతే..ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నాస్కాం విజయవంతంగా నిర్వహించలేకపోయేది.
see also : 2వేల553 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..!
దేశంలో మొట్టమొదటి సారిగా ముంబైలో కాకుండా వేరే నగరంలో అది కూడా హైదరాబాద్‌లో నిర్వహించేందుకు మంత్రి కేటీఆర్ కారణం’ అని అన్నారు. ప్రఖ్యాత సేల్స్‌ఫోర్స్ సంస్థ సీఈఓ అయితే ప్రత్యేక ట్వీట్ ద్వారా కొనియాడారు. ‘మంత్రి కేటీఆర్‌ను కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని ట్వీట్ చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ ప్రసంగం అనంతరం పలు కంపెనీల ప్రతినిధులు ఆయనపై ప్రశంసలు గుప్పించారు. నాస్కాం బీపీఎం కౌన్సిల్‌కో చైర్మన్ శ్రీకాంత్ వెల్లంకని మాట్లాడుతూ తెలంగాణలో ఈ నూతన కేంద్రం ఏర్పాటు చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని అన్నారు. మంత్రి కేటీఆర్ పనితీరును, తెలంగాణ ఐటీ రంగం వృద్ధిని, ప్రత్యేకతను గుర్తిస్తూ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
see also : వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!