ఏడు సంవత్సరాల తర్వాత కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షలో భాగంగా అర్హులై ఉండి స్వదేశానికి రావడానికి విమాన టికెట్ చార్జీలకు డబ్బులు లేక కువైట్ లో ఆగిపోవలసి వచ్చిన వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఆపన్న హస్తం అందించిన సంగతి తెలిసిందే. టికెట్లు తామే కొని ఇస్తామన్న తెలంగాణ జాగృతి ప్రకటన మేరకు ఆ సంస్థను సంప్రదించిన వారికి అందించిన విమాన చార్జీలతో కువైట్ నుండి బయలుదేరిన మొదటి బృందం మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత హైదరాబాద్ చేరుకున్నారు.
కువైట్ నుండి వచ్చిన 9 మందికి శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జాగృతి యువత అధ్యక్షులు కొరబోయిన విజయ్ ఇతర జాగృతి నాయకులు స్వాగతం పలికారు. కువైట్ నుండి వచ్చిన వారు తమ చేదు అనుభవాలను మీడియాకు వివరించారు. తమను స్వదేశానికి రావడానికి సహకరించిన ఎంపీ కల్వకుంట్ల కవితకు బాధితులు కృతఙ్ఞతలు తెలిపారు. బాధితులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తెలంగాణ జాగృతి ఏర్పాట్లు చేసారు.
జాగృతి సహాయంతో నేడు స్వదేశానికి చేరుకున్న వారి వివరాలు
1) అంగోత్ ప్రకాష్ – (X0712690)
2) గుగులోత్ దేవీదాస్ (J5086477) –
3) మలావాత్ రవి కుమార్ (X0710518) –
4) మెగావత్ జెత్యా – (X0710519) –
5) పుల్లా రంజీత్ (X0713708) –
6) అజ్మీరా శ్రీనివాస్ (X0711736) –
7) శాగ మహిపాల్ (X0710523)
8 ) గొల్ల అనుకుమార్ (X0713695)
9) అంతిరెడ్డి రాజు ( K1408758)