సాధారణంగా మనకు చౌక ధరలో అందుబాటులో ఉండే మంచి పోషకాహారం కోడి గుడ్డు. కోడిగుడ్డు ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా బి6 ,బి12 తో పాటు కాల్షియం ,ఐరన్,జింక్ ,పోలిక్ యాసిడ్ ,పాస్పరస్ ,పోటాషియం ,కాపర్,మెగ్నీషియం ఇంకా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి.అయితే గుడ్డును తినడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మకాంతి పెంచుతుంది..
గుడ్డులో ఉండే మిటమిన్ ఇ.. మీ చర్మ కాంతిని పెంచేందుకు దోహదపడుతుంది.ప్రతీ రోజు గుడ్డు తీసుకుంటే అందులోని ప్రోటీన్లు మీ చర్మ కణాలను శుద్ధిచేసి ,మెరుపును తీసుకువస్తాయి.
కంటి సమస్యలు దూరం చేస్తుంది.
కోడిగుడ్డులో కెరోటినాయిడ్లు ,ల్యుటిన్ అనే పోషకాలు ఉంటాయి.ఇవి కంటి సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి.కోడి గుడ్డులో శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి.
see also :ఫైనాపిల్ తింటే ఇన్నీ ఉపయోగాలా..?
జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది..
ప్రతి రోజు గుడ్డును ఆహారంలో తీసుకోవడం వల్ల మీ జుట్టు పెరుగుదలను పెంచుకోవచ్చు.ఇందులో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.అంతేకాకుండా గుడ్డును తలకు అప్లై చేసుకోవడం వల్ల అందమైన కురులను సొంతం చేసుకోవచ్చు.
మంచి పోషకాహారం..
గుడ్డు ఒక మంచి పోషకాహారం.చిన్న పిల్లలుతో పాటు వయస్సు పైబడిన వారు కూడా గుడ్డును తినవచ్చు.ఇది ఎదిగే పిల్లలకు కావాలిసిన పోషకాలను అందిస్తుంది.
see also : మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
బరువును పెంచదు..
గుడ్డులో ఉండే ప్రో టిన్స్ వల్ల లబించే కేలరీల వల్ల మీ శరీరానికి బరువు పెరగని బాలాన్ని ఇస్తుంది.అందువల్ల బరువు తగ్గాలి అని అనుకునే వారు తమ డైట్ లో గుడ్డును చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అంతేకాకుండా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇందులో ఉండే పాస్పరస్ మీ ఎముకల దృడ త్వానికి సయం చేస్తుంది.ముఖం పై ముడతలను నివారించి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
see also : మొలకలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!