తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోదరి విమలాబాయి ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.ఈ సందర్భంగా ఆమె పార్థివదేహానికి సీఎం కేసీఆర్ అల్వాల్ లోని ఆమె నివాసంలో నివాళులు అర్పించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు ప్రముఖులు విమలాబాయికి నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం అల్వాల్లో విమలాబాయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.కాగా సీఎం కేసీఆర్కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక అన్న ఉన్నారు. చనిపోయిన విమలాబాయి సీఎం కేసీఆర్ కు రెండో అక్క.
see also : కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..ఎమ్మెల్సీ కర్నె
see also :రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్