ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సాధన కోసం వివిధ ప్రాంతాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో జరిగిన చర్చలో పాల్గొన్న సినీ నటుడు శివాజీపై దాడి జరిగింది. ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలో హోదాపై ఆయన ప్రసంగిస్తుండగా, ఒక్కసారిగా దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై భౌతికదాడికి దిగారు.
see also..జనసేన ఎంత..! దాని బతుకెంత..!! జేపీ సంచలన వ్యాఖ్యలు
అసలు ఏం జరిగిందంటే..చర్చలో శివాజీ మాట్లాడుతూ, బీజేపీ వైఖరిని తూర్పారబట్టాడు. “మోదీ జీరో… మోదీ జీరో” అంటూ శివాజీ నినాదాలు చేశారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు జోక్యం చేసుకొని “శివాజీ డౌన్ డౌన్” అని నినాదాలు చేశారు. శివాజీ ఆగ్రహంతో ప్రజలు మిమ్మల్ని ఇంకా మాట్లాడనిస్తున్నారు. ఇంకా ఇదే పరిస్థితి ఉంటే తరిమి కొడతారని హెచ్చరించారు. ఆపై బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా శివాజీపై పడటంతో, అక్కడే ఉన్న ప్రజా సంఘాలు, ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాసేపు చర్చ ప్రాగాణం మొత్తం రణరంగంగా మారింది.
see also..జగన్‌కి అంత చిన్న వయసులో ఆ ప్రజాకర్షక శక్తి ఎవరికుందో చూపండి.. సీనియర్ కాంగ్రెస్ నేత