రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ,జనసేన పార్టీలు కల్సి మిత్రపక్షంగా బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.దీంతో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ,కడపకు ఉక్కు పరిశ్రమ లాంటి పలు హామీలను కురిపించి ఎన్నికల బరిలోకి దిగాయి.
See Also:వైసీపీలోకి 40వేలమందితో మాజీ ఎమ్మెల్యే…జగన్ గ్రీన్ సిగ్నల్…
ప్రజలు నమ్మి పట్టం కట్టారు.తాజాగా ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి విభజన చట్టంలో హమీల గురించి కానీ ,కేటాయించాల్సిన నిధుల గురించి కానీ ఊసే లేకుండా కేంద్రం ఆమోదించింది.అయితే దీనిపై ప్రస్తుతం టీడీపీ బీజేపీ మధ్య సవాలు ప్రతిసవాళ్ళ హోరు మారుమ్రోగుతుంది.ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో మిత్రపక్షంగా ఉండలేము అని ఇటు టీడీపీ అటు బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు.
see also : వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!
తాజాగా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రస్తుత రాజకీయ అస్థిరతపై క్లారిటీ ఇచ్చారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీతో కల్సి పని చేసే వీలు లేదు.తప్పకుండ ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్న టీడీపీతోనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ఆయన క్లారిటీ ఇచ్చారు.