టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఓ వైవిధ్యభరితమైన సినిమా ‘అ!’. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. కాన్సెప్టే చాలా కొత్తగా ఉందని కొందరూ… అసలు కథే అర్ధం కాలేదని మరికొంత మంది రివ్యూలు ఇచ్చేశారు. అయితే ‘అ!’ చిత్రంలో మన గమనిస్తే.. ఒకే ఒక సాంగ్ ఉంది. అది కూడా టైటిల్స్ పడే సమయంలో. అయితే ఇక్కడున్న ఆసక్తికర సంగతి ఏమిటంటే ఆ థీమ్ సాంగ్ లోనే స్టోరీ మొత్తం చెప్పారు దర్శకుడు. సినిమాని బాగా గమనిస్తే ప్రతి ఫ్రేమ్ లోను ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. అలాగే నెక్స్ట్ సీన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మరి ఆ థీమ్ పై ఓ లుక్కేద్దామా..
************
విశ్వమే దాగినా నాలోనా..
ఎప్పుడూ ఒంటరే నేనేనా..
చూపులే గుచ్చినా అడగనైనా లేనా..
చేతులే వేశినా ఆపనైనా లేనా..
కాలమే చేసినా.. మాననీ గాయం..
యంత్రమే చూపదా నాగమ్యం..
అందనే అందదే ఒక్క అవకాశం..
అందితే చేరనా నేను ఆకాశం..
అందరూ తప్పనీ చూపినా వేలే..
ఊహకే అందనీప్రేమ నాదేలే..
ఇంతగా ఎగిరినా తాకుతోంది నేలే..
మత్తులో మరగనా మునుగుతున్నా తేలే..
నా చిన్నీ గుండెలో.. ఏదో వేదనా.. మొదలయ్యేనా..
నా అన్నీ ఆశలే.. గాయం మాటునా.. మిగిలేనా..
మనసిలా అద్దమై ముక్కలయ్యేనా..
ఒక్కరే వందలా చుట్టుమూగేనా..
కరగనూ, కలవనూ..ద్వేషమే వదలనూ..
గతమునే, విడువనూ.. మరణమే మరువనూ..
శతృవై, దేహమే.. మనసుతో కలబడే..
చీకటే, వీడెనే.. బ్రతుకుకే సెలవనే.. కదిలెనే..
## నేటితో బాధలే తీరేనా.. నాదనే లోకమే చే..రా..నా..