ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత తాజాగా తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా దూకుడు పెంచారు. ఒకవైపు కాళ్లకు బొక్కలు పడినా బ్రేక్ ఇవ్వకుండా పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్.. ఏపీ ప్రత్యేకహోదా పై అయితే అధికార టీడీపీని పూర్తిగా కార్నర్ చేశారు. దీంతో చంద్రబాబు అండ్ బ్యాచ్‌కి ఏం చేయాలో అర్ధం కాక.. జగన్ పై దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారు.
see also : ఫిరాయింపు బ్యాచ్‌కి బంపర్ ఆఫర్.. జగన్ షాకింగ్ డిసిషన్..!
ఇప్పటికే జగన్ తాజా స్ట్రైట్ సవాల్‌ల దెబ్బకి పవన్ కళ్యాణ్ పడుకోగా.. చంద్రబాబు సైతం ఛా.. ఛీ అంటూ కాలయాపన చేస్తూ జగన్ పై ఎల్లోదాడి చేయిస్తున్నారు. అందులో భాగంగా సీఎం సీటు కోసమే జగన్ రాష్ట్రాన్ని ముప్పుతిప్పలు పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం రామనారాయణరెడ్డి దిక్కుమాలిన విమర్శలు చేశారు. జగన్ రాజీనామా వ్యాఖ్యలు డ్రామాలని.. ప్రజలు ఇవన్నీ చూస్తున్నారని.. అయితే జనం ఇలాంటి వాటికి పడిపోరని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడే స్థాయి రోజాకు లేదని కూడా ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరి ఆనం వ్యాఖ్యలకి వైసీపీ శ్రేణులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.
see also : టీడీపీ భారీ స్కెచ్.. మొత్తం 14.77 లక్షల వైసీపీ ఓట్లు తొలగింపు..!