ఏపీలో నిన్న మొన్నటివరకు వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు తిరిగి తమ సొంత గూటికి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.వైసీపీ నుండి టీడీపీలో చేరే సమయంలో అభివృద్ధిని చూసి చేరుతున్నామని చెబుతున్న సదరు ఎమ్మెల్యేలు అక్కడకి వెళ్ళిన తర్వాత చెప్పినంతగా అభివృద్ధి జరగకపోవడంతో తిరిగి తమ సొంత గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే మణి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతో కొంతమంది తమ అత్మభిమానాన్ని చంపుకొని మరి అమ్ముడుపోయి టీడీపీలో చేరుతున్నారు.నేను అలా కాదు.కేవలం నియోజక వర్గ అభివృద్ధి కోసం చేరాను.
కానీ ఇంతవరకు ఏమి చేయలేకపోతున్నాను.వైసీపీ నుండి వచ్చాను అని సర్కారు కూడా ఏమి సహకరించడంలేదు.బద్వేలు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే జయరాముడు కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారు.ఈ నిర్ణయం ఆరు నెలలకు ముందే తీసుకున్నారు.త్వరలోనే ఆయన పార్టీ మారనున్నారు .మరో మూడు నెలల్లో రాజకీయ సమీకరణలు మారతాయి అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.మణి గాంధీ చేసిన వ్యాఖ్యల బట్టి త్వరలోనే వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి తమ సొంత గూటికి రావడం ఖాయం అన్నమాట ..