ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన టీవీ 9 మీద ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ,నిత్యం వరస వివాదాలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ క్రిమినల్ కేసు పెట్టనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో పోస్టు చేశారు.అంతే కాకుండా మరో ట్వీట్ లో ఏకంగా ఆ ఛానల్ లో సీనియర్ యాంకర్ అయిన రజనీ కాంత్ పై నిప్పులు చెరిగారు.
వాస్తవాలను కప్పిపెడుతూ అసత్యాలను వార్తా కథనాలుగా ప్రసారం చేయిస్తున్నారని వర్మ ఆరోపించారు.తనపై అసత్య వార్తలతో విష ప్రసారం చేస్తూ తనపై బురద చల్లుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు.ఒకపక్క తనపై విచారణ జరుగుతుండగానే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అంటూ తప్పు కథనాలను ప్రసారం చేస్తూ తన పరువుకు భంగం కల్గిస్తున్నారని ..ఇలా చేయడం కూడా నేరమని ..త్వరలోనే టీవీ9 ఇండియన్ లాను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించాడు ..