Home / ANDHRAPRADESH / ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం..విచక్షణా రహితంగా దారుణం..!

ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం..విచక్షణా రహితంగా దారుణం..!

ఏపీలోని అనంతపురం జిల్లా లో సోమవారం ఆర్ధరాత్రి ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు వీరంగం సృష్టించారు. ఒకే ఒక్క చిన్న కారణంతో దారుణంగా దాడి చేశారు. బైక్ హారన్ కొట్టారని కారణంతో నలుగురు యువకులను విచక్షణా రహితంగా చితకబాదారు. నవోదయ కాలనీకి చెందిన నారాయణస్వామి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంటి సమీపంలో ఎమ్మెల్యే అనుచరులు వేగంగా బైక్‌పై నారాయణ స్వామిని ఓవర్ టేక్ చేశారు.

ఈ క్రమంలో నారాయణస్వామి హారన్ కొట్టగా ఎమ్మెల్యే అనుచరుడు ‘ఏరా నేను వెళ్తుంటే హారన్ కొడతావా’ అంటూ దుర్భాషలాడారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనుచరుడు కొంతమందిని తీసుకొచ్చి రోడ్డుపైనే నారాయణస్వామిని చితకబాదారు. తనను వదిలేయాలని నారాయణస్వామి కాళ్లు పట్టుకుని వేడుకున్నా వినకుండా తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత నారాయణస్వామి హౌసింగ్ బోర్డుకు వెళ్లి తన బంధువు అయిన రాజశేఖర్‌కు ఫోన్లో సమాచారం అందించాడు. రాజశేఖర్ తోపాటు చిరంజీవి, అనిల్ కుమార్‌లు కలిసి ఎమ్మెల్యే నివాసం వెళ్లారు. నారాయణస్వామిని ఎందుకు కొట్టారని ఎమ్మెల్యే అనుచరులను ప్రశ్నించారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు.. వారిని కూడా చితకబాదారు. వారి మెడలోని గొలుసు, బ్రాస్‌లెట్‌ను లాగేసుకున్నారు. రాజశేఖర్‌కు తలపై ఎనిమిది కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై టూటౌన్ ఎస్ శివగంగా రెడ్డి.. దర్యాప్తు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat