రెజీనా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన సమయంలో తనతో పాటు వచ్చిన హీరోయిన్లందరూ టాప్ హీరోయిన్ల రేంజ్ కు చేరుకుంటే అమ్మడు ఎంచుకునే కథల వలన ఎక్కడ వేసిన గొంగడి లెక్క అక్కడే ఉంది.అయితే ఇటివల ఆమె కెరీర్ మరల పుంజుకున్నట్లు కనిపిస్తుంది.అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీను తగ్గించి తమిళం వైపు దృష్టి పెట్టింది అమ్మడు.
దీంతో అక్కడ అవకాశాలను దక్కించుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ బక్కపలుచు భామకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది.ప్రముఖ నటులు రాజ్ కుమార్ రావ్ ,అనిల్ కపూర్ ,జూహ్లి చావ్లా ప్రధాన పాత్రల్లో పోషిస్తున్న ఏక్ లడ్కికో దేఖతో ఐసా లగా అనే మూవీలో అవకాశం దక్కింది .
అయితే దీనికోసం చాలామంది ప్రధాన హీరోయిన్లందరూ వచ్చిన కానీ దర్శకుడు షెల్లీ చొప్రధర్ రేజీనానే ఖరారు చేశాడట ..చూద్దాం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ కెళ్ళిన టాబు లా అమ్మడు నిలబడుతుందో ..ఇలియానా లా కూలబడుతుందో ..!