Home / TELANGANA / రామప్ప, లక్నవరానికి దేవాదుల జలాలు..మంత్రి చందూలాల్

రామప్ప, లక్నవరానికి దేవాదుల జలాలు..మంత్రి చందూలాల్

రామప్ప , లక్నవరం సరస్సులకు దేవాదుల ద్వారా గోదావరి నీటిని మళ్లించి ములుగు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక , సంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని వార్ రూంలో దేవాదుల, నీటి పారుదల, మిషన్ భగీరథ, ఐడీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామప్ప, లక్నవరం సరస్సులతోపాటు ఇంచెన్ చెరువు, లోకం చెరువు, జాకారం, అబ్బాపురం, మల్లంపల్లి, రామచంద్రపురం చెరువులోకి గోదావరి నీటిని తరలించేందుకై దేవాదుల పైప్‌లైన్ వెంట పాయింట్‌లను ఏర్పాటుచేయడానికి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సముకత వ్యక్తం చేశారని అందుకు అనుగుణంగా అధికారులు పాయింట్లు ఏర్పాటుచేసి పనులను ప్రారంభించాలని ఆదేశించారు.

ఎస్సారెస్పీ డీబీఎం 38 కాల్వతోపాటు ఐఆర్ 26 కాల్వ మ రమ్మతుల కోసం రూ.14.41 కోట్లు మంజూరయ్యయాని ఈ పనులను త్వరలోనే పూర్తి కానున్నట్లు వెల్లడించారు. ములుగు గట్టమ్మ నుంచి సర్వాపురం వరకు గల ఎస్సారెప్పీ కాల్వ మరమ్మతులు చేపట్టంతో పాటు మల్లంపల్లి నుంచి అబ్బాపురం వరకు గల ప్రధాన కాల్వకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. కాల్వల మరమ్మతులు పూర్తైన తరువాత నేరుగా మిడ్ మానేరు నుంచి కాకతీయ కాల్వ ద్వారా తాగునీరు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. దాంతో పాటు ఇటు దేవాదుల పాయింట్ ఏర్పాటు చేయడం ద్వారా సమృద్ధిగా రైతాంగానికి సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

రామప్ప చెరువులోకి సహజసిద్ధంగా రావాల్సిన వరద జలా లు రాకుండా దేవగిరిపట్నం వద్ద ఎస్సారెస్పీ కాల్వ వెళ్లడం వల్ల నీటి వరద ఎస్సారెస్పీ కాల్వలో పడి లక్నవరం వెళ్తుందని దీంతో రామప్పకు రావాల్సిన వరద జలాలు రావడం లేదని చెప్పారు. దీనిపై సబ్ కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారని తెలిపారు. కాల్వ మర్మతుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేసి నిధులు మంజూరు చేసి వచ్చే యాసంగి నాటికి పనులను పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
ములుగు సమీపంలోని తోపుకుంటపై మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి సంబంధించి పనులు పెండింగ్ ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తరుచూ బదిలీ అవుతుండటం వల్ల అవగాహన లేమితో ట్యాంక్‌బండ్ పనులు నిలిచిపోయాయని వెంటనే ఇందుకు సంబంధించిన పునర్ ప్రణాళిక రూపొందించి పనులను తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు.

గౌరారం వాగుకు రూ10.03 కోట్లు ..
మంగపేట మండలంలోని గౌరారం వాగుపై ప్రాజెక్టు నిర్మించడం కోసం రూ.10.03 కోట్లు వ్యయంతో ప్రణాళిక పంపించినట్లు నీటి పారుదల శాఖ ఎస్‌ఈ ప్రసాద్ మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 20 ఎకరాల వరకు భూమి అవసరముందన్నారు. అక్కడి రైతులు తమ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ విషయం పై దృష్టిసారించి రైతులను ఒప్పించాలని మంగపేట జెడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం, మాజీ ఎంపీపీ పచ్చ శేషగిరిరావు, సామ మోహన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కప్పవాగు, జీడివాగు, పాలెంవాగు తదితర ప్రాజెక్టులకు సంబంధించిన పురోగతులపై సమీక్షించారు.

పనులను అడ్డంకిగా మారిన భూ వివాదం ..
దేవాదుల మూడో దశ పనులకు భూవివాదం అడ్డంకిగా మా రిందని దేవాదుల అధికారులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ములుగు మండలం బండారిపల్లి వద్ద జరుగుతున్న టెన్నెల్ ని ర్మాణ పనులకు స్థానిక రైతులు కొంతమంది అభ్యంతరం తెలుపుతున్నారని తెలిపారు. ఈ విషయంపై వెంటనే ప్రైవేట్ సర్వేయర్లతో భూ సర్వేలు చేసి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుని పనులు ఆగకుండా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్‌ను మంత్రి ఆదేశించారు. ఈ విషయం లో ములుగు జెడ్పీటీసీ సకినాల శోభన్‌కు అక్కడి రైతులను ఒప్పించే బాధ్యతను మంత్రి అప్పగించారు.

గోదావరి కరకట్టకు రూ.120 కోట్లు ..
మంగపేట మండలంలోని పుష్కర్‌గఢ్ వద్ద గోదావరి కరకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో రూ.120 కోట్ల మంజూరు చేయబోతుందని నీటి పారుదల శాఖ ఎస్‌ఈ ప్రసాద్ మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ ప్రాంతంలో ప్రతి యేటా భూమి ధరి కోతకు గురవుతుండటంతో రైతుల భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితులల్లో ఇక్కడ కరకట్టలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇక్కడ అవసరమైన నిధులను మంజూరు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఈ నిధులు మంజూరు కానున్నాయి. గోదావరిపై ఎత్తిపోతల పథకాల కోసం కూడా నిధులు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. గొల్లగూడెం ఎత్తిపోతల పథకానికి రూ.20 కోట్లు, ఆ కినపల్లి మల్లారం ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధులు గిరిజన సంక్షేమశాఖ నుంచి విడుదల చేస్తామని తెలిపారు.

మిషన్ కాకతీయలో 850 చెరువుల పనులు పూర్తి ..
ఇప్పటి వరకు మూడు విడతలుగా జరిగిన మిషన్ కాకతీయ చెరువుల మరమ్మతుల్లో నియోజకవర్గంలో 850 చెరువుల పనులను పూర్తిచేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సారి మరో 400 చెరువులను నాలుగో విడత కింద పనులు చే పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 50 చెరువుల కు పైగా ప్రతిపాధనలు పంపించామని 11 చెరువులకు టెండర్లు చేసి అగ్రిమెంట్లు చేసుకున్నట్లు తెలిపారు.

జూన్ కల్లా ఇంటింటికీ తాగునీరు..
వచ్చే జూన్ నాటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీటి అందించే ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు మిషన్ భగీరథ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి హాబిటేషన్‌కు రక్షిత మంచినీరు అందించాలని సూచించారు. నియోజకవర్గంలో 700 కిలో మీటర్ల మేరకు పైప్‌లైన్ నిర్మించాల్సి ఉం డగా ఇప్పటి వరకు 660 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ నిర్మాణం పూర్తయిందని మరో 40 కిలోమీటర్లకు ఫారెస్టు అధికారులు క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు. నియోజక వర్గంలో 315 ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 164 పనులు ప్రారంభమైనట్లు మిషన్‌భగీరథ ఈఈ నిర్మల మంత్రి దృష్టికి తెచ్చారు. మండలా ల వారీగా పనులు పురోగతి లో ఉన్నాయని జూన్‌కల్లా అన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కొత్తగూడెం మండలానికి సంబంధించి పాలే రు నుంచి మంచినీటిని ఇ వ్వడానికి ఏర్పాట్లు చేశామ ని అధికారులు తెలిపారు. కాగా సీఎం రిలీఫ్ ఫండ్ బా ధితులకు మంత్రి చందూలాల్ చెక్కులను పంపిణీ చే శారు. సమావేశంలో సబ్ కలెక్టర్ వీపీ గౌతమ్, ము లుగు మార్కెట్ కమిటీ చైర్మ న్ ప్రహ్లాద్,జెడ్పీప్లోర్ లీడర్ సకినాల శోభన్, జెడ్పీటీసీ లు సిద్ధం శెట్టి వైకుంఠం, వలీయాబీ, ఎంపీపీలు భూ క్యా మంజుల, జెట్టి సుజా త, మున్నీరున్నిసాబేగం, అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat