జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జేఎఫ్‌సీకి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, జేఎఫ్సీ వేదికగా చంద్రబాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో పాల్పడిన అవినీతిని ఎండగట్టేందుకు, జేఎఫ్సీని వేదికగా చేసుకుని చంద్రబాబు అవినీతి లెక్కల చిట్టా బయటకు తీద్దామని ప్రయత్నిస్తున్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు పవన్ కల్యాణ్ అడుగడుగునా అడ్డు తుగులుతున్నాడట.
see also :అన్ లైన్ సర్వేలో దూసుకుపోతున్న వైఎస్ జగన్..!
అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులకు సంబంధించి నివేదిక ఇస్తామని చంద్రబాబు సర్కార్ ప్రకటించడంతో.. స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నికల వేళ చంద్రబాబును నమ్మరాదని చెప్పిన ఉండవల్లి అరుణ్‌కుమార్ మాటలను పవన్ కల్యాణ్ పెడ చెవిన పెట్టారట. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్తా ముదిరి పాకాన పడటంతో త్వరలో జేఎఫ్‌సీపై విమర్శలు చేసి బయటకు వచ్చేందుకు రెడీ అయ్యారట ఉండవల్లి అరుణ్‌కుమార్.