ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది.ఈ సందర్భంగా నాస్కామ్ 2017-18 సంవత్సరానికి ఐటీ రంగంపై నివేదికను విడుదల చేసింది. ఐటీ ఆదాయంలో 7.8 శాతం వృద్ధి ఉందని నాస్కామ్ పేర్కొంది. అంకురాలలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉంది. అంకుర సంస్థల్లో వృద్ధి 25 శాతం వరకు ఉందని నాస్కామ్ నివేదికలో తెలిపింది . ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో ఈ సంవత్సరం కొత్తగా లక్ష ఉద్యోగాలు వచ్చాయి. వచ్చే సంవత్సరం మరో లక్ష ఉద్యోగాలకు అవకాశముంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆప్ థింగ్స్ రంగాల్లో వృద్ధి అధికంగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.
Govt of Telangana and @nasscom sign an MoU to establish a Centre of Excellence for Data Science and AI at Hyderabad: The MoU was signed by @RentalaShekhar @jayesh_ranjan in the presence of Minister @KTRTRS pic.twitter.com/oaoYSNe6HN
— Min IT, Telangana (@MinIT_Telangana) February 20, 2018