ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు .జగన్ కేసుల మాఫీ కోసమే డ్రామాలు ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి రోజుకో మాట… పూటకో తీర్మానం చేస్తున్నారని విమర్శించారు. ప్రజసంకల్ప యాత్ర పేరుతో జగన్ నాటకం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు . చీకటి ఒప్పందాలు, మైత్రిని కొనసాగించడానికి జగన్ ప్లాన్ వేశారని ఆరోపించారు.కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని చెప్పారు.